Nani HIT 3 Movie | అగ్ర కథానాయకుడు నాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం హిట్ 3. బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ హిట్ నుంచి వస్తున్న 3వ చిత్రమిది. ఈ చిత్రంలో నాని కథానాయకుడిగా నటించడంతో పాటు నిర్మాణ బాధ్యతలు చేపట్టాడు. శైలేశ్ కొలను దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుండగా.. మే 01న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక వార్త వైరల్‌గా మారింది. ఈ సినిమాలో తమిళ నటుడు కార్తీ అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. కొందరు ఏమో కార్తీ నానితో కలిసి కనిపిస్తాడని ప్రచారం చేస్తుండగా.. మరికొందరు కార్తీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించవచ్చని అంటున్నారు. హిట్ 2 క్లైమాక్స్ లాగానే “హిట్ 3” క్లైమాక్స్ లో కొత్త హీరో ఎంట్రీ ఇస్తాడని ఆ హీరో పాత్రలోనే కార్తీ రాబోతున్నాడని.. ఇది “హిట్ 4” కి లీడ్ ఇస్తుందని కూడా టాక్ నడుస్తుంది. కాగా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇక హిట్ 3 విషయానికి వస్తే.. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌తో రానున్న ఈ సినిమాలో నాని అర్జున్ సర్కార్ అనే పవర్ఫుల్ ఐపీఎస్ అధికారిగా కనిపించనున్నారు. కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది.