Tere Ishk Mein | బాలీవుడ్లో నటుడు ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం ‘తేరే ఇష్క్ మే’ (Tere Ishq Mein). ఈ సినిమా నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ శుక్రవారం ముంబైలో జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో మీడియా ధనుష్‌ని లవ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అని అడుగగా.. ధనుష్ సమాధానమిస్తూ.. ప్రేమ గురించి నాకు ఎక్కువ తెలియదు. అది ఒక ఓవర్రేటెడ్ ఎమోషన్ అంటూ చెప్పుకోచ్చాడు. దీంతో ఈ సమాధానం విన్నవారందరూ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. ‘తేరే ఇష్క్ మే’ చిత్రం కూడా ప్రేమకథే అయినప్పటికీ అందులో భావోద్వేగాల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. రాన్‌జానా (Raanjhanaa), అత్రాంగి రే(Atrangi Re) చిత్రాల దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. కృతి సనన్ కథానాయికగా నటిస్తుంది. ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు హిమాన్షు శర్మ, నీరజ్ యాదవ్ కథను అందిస్తుండగా.. భుషణ్ కుమార్, కృష్ణ కుమార్, ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Q: What is LOVE for You❓#Dhanush: I don’t know, i think it’s just another OVERRATED emotion pic.twitter.com/B122lCBhw0
— AmuthaBharathi (@CinemaWithAB) November 15, 2025