కడిగిన ముత్యం కవిత.. మాజీ ఎంపీ వినోద్‌కుమార్ వెల్లడి
జాగృతి అధ్యక్షురాలు కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుందని బీఆర్ఎస్ అగ్రనేత కేసీఆర్ ఆనాడే చెప్పారని, ఇప్పుడు కోర్టు తీర్పుతో అదే నిజమైందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు.
- ఈ విషయం ఆనాడే చెప్పిన కేసీఆర్
- ఇప్పుడు తీర్పు కూడా అలాగే వచ్చింది
హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): జాగృతి అధ్యక్షురాలు కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుందని బీఆర్ఎస్ అగ్రనేత కేసీఆర్ ఆనాడే చెప్పారని, ఇప్పుడు కోర్టు తీర్పుతో అదే నిజమైందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం, ప్రత్యర్థులను అణచివేయడమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అల్లిన కుట్రలు ఒక్కొక్కటిగా వీగిపోతుండటం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఆప్ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఆ పార్టీ నేత మనీశ్ సిసోడియా, కవిత వంటి నాయకులపై మోపిన అక్రమ కేసులు కేవలం రాజకీయ కక్షతో కూడుకున్నవని కోర్టు తీర్పుల ద్వారా స్పష్టమవుతున్నదని తెలిపారు.
ట్రయల్ కోర్టు విచారణ చేయడానికి కూడా ఈ కేసులో సాక్ష్యాలు లేవని, మొదటి దశలోనే కేసును కొట్టివేయడం సంతోషకరమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎటువంటి సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయంగా బద్నామ్ చేయడమే ధ్యేయంగా, ఈ కేసులు పెట్టారని విమర్శించారు.
దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకొని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకులను ఇబ్బంది పెట్టాలని చూసిన శక్తులకు ఇది గొడ్డలిపెట్టు అని హెచ్చరించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎంతటి దుష్ప్రచారం చేసినా, చివరికి సత్యమే జయించింది అని చెప్పారు. ఇది భారత రాజ్యాంగం పట్ల నమ్మకాన్ని పెంచే న్యాయ విజయమని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీని, ఆ పార్టీ నాయకత్వాన్ని అభాసుపాలు చేయాలని చూసిన కుతంత్రాలన్నీ పటాపంచలయ్యాయని పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | పచ్చికొబ్బరి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు.. ఎందుకో తెలుసా..?
MLC Dasoju Shravan Kumar | ప్రకాష్ గౌడ్‌కి రెడ్ కార్పెట్ వేసి.. మా సుధీర్ రెడ్డినేమో అడ్డుకున్నారు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
టీజీఎస్ఆర్టీసీ నల్లగొండ రీజియన్ బతుకమ్మ, దసరా ఆదాయం
అనంతగిరి ఎంఈఓగా వెంకటయ్య బాధ్యతల స్వీకరణ
‘కరువు సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

