దిలీప్ ప్రకాష్, రెజీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఉత్సవం’. అర్జున్‌సాయి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సురేష్ పాటిల్ నిర్మించారు. నాటకరంగం నేపథ్య కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో సురభి నాటకరంగం కళాకారులను చిత్రబృందం సత్కరించింది. ఈ సందర్భంగా నటుడు అలీ మాట్లాడుతూ ..నాటకరంగం నుంచి వచ్చిన వారు పరిశ్రమలో గొప్ప నటులుగా ఎదిగారని, ఈ నేపథ్యంలో సినిమా చేయడం చాలా గొప్ప విషయమని, ఇలాంటి మంచి సినిమాలను ప్రోత్సహించాలని అన్నారు. అన్ని కళల్లో నాటకం గొప్పదని, నాటకం బ్యాక్‌డ్రాప్‌లో ఫ్యామిలీ డ్రామా, లవ్‌స్టోరీ కలబోసి ఈ సినిమా చేశానని, చూసిన వారందరూ మంచి ప్రయత్నమని అభినందిస్తున్నారని దర్శకుడు అర్జున్ సాయి తెలిపారు. విడుదలైన అన్ని కేంద్రాల్లో మంచి స్పందన లభిస్తున్నదని నిర్మాత సురేష్ పాటిల్ పేర్కొన్నారు.