చిరంజీవి సినిమా అంటే అభిమానులు ముందుగా కోరుకునేది డాన్సులు. అవి ఉంటేనే చిరు సినిమా అవుతుంది. ఆ తర్వాతే యాక్షన్ అయినా.. కామెడీ అయినా.. ఎంటర్ టైన్మెంట్ అయినా. అలాంటి వింటేజ్ చిరంజీవిని చూసి చాలా రోజులు అయిపోయింది. ఖైదీ నెం 150 తర్వాత చేసిన సైరాలో అలాంటివేం లేవు. ఈ సినిమాలో డాన్సులు చేయలేదు చిరు. కథ ప్రకారం చాలా హూందాగా కనిపించాడు. దాంతో ఇప్పుడు ఆచార్య సినిమాపైనే అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. దాన్ని నిజం చేస్తూ ఇప్పటికే విడుదలైన లాహే లాహే పాట అద్భుతాలు సృష్టించింది. అది చూసిన తర్వాత చిరు అభిమానులు ఫిదా అయిపోతున్నారు. అసలు అన్నయ్య వయసు 66 ఉంటుందా అంటూ మనకు మనమే ప్రశ్నలు వేసుకోవాలి.
పాటలో చిరు కనిపించిన విధానం చూసి వింటేజ్ మెగాస్టార్ ఈజ్ బ్యాక్ అని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. ఎప్పుడెప్పుడు ఫుల్ వీడియో సాంగ్ వస్తుందా అని వేచి చూసేలా చేస్తుంది. ఆచార్యలో డాన్సులకు కొదవ ఉండదని ఇప్పుడు ప్రోమో చూస్తుంటే క్లారిటీ వచ్చేస్తుంది. లాహే లాహే అంటూ సాగే తొలి పాటకు ఇప్పుడు యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ వచ్చాయి. టీజర్లో అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చిన మణిశర్మ.. తొలిపాటకు కూడా అంతే ఊపిచ్చే ట్యూన్ ఇచ్చాడు. గతంలో చిరుకు ఎన్నో మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు మణిశర్మ.
ఇప్పుడు ఆచార్యకు కూడా ఇదే చేసుంటాడని నమ్ముతున్నారు అభిమానులు. నక్సలిజం బ్యాక్‌డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో డాన్సులు, కామెడీ ఉండవని ఫిక్స్ అయిపోయిన వాళ్లకు ఈ పాట సమాధానంగా మారిపోయింది. ఖైదీ నెం 150లో తనదైన స్టెప్పులతో పిచ్చెక్కించిన మెగాస్టార్.. ఆచార్యలోనూ అదే చేయబోతున్నాడు. 66 ఏళ్ల వయసులో అన్నయ్య ఎలా డాన్సులు చేసుంటారనే ప్రశ్నకు సమాధానం పాటతోనే వచ్చేసింది. ఈ పాట కోసమే అప్పట్లో భారీ సెట్ కూడా వేసారు. అప్పట్లో దాదాపు 500 మంది జూనియర్ ఆర్టిస్టులతో పాటను చిత్రీకరించాడు దర్శకుడు కొరటాల శివ. ఫిబ్రవరి 4, 2022న సినిమా విడుదల కానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Ranbir Alia wedding| రణ్‌బీర్‌కపూర్-అలియా పెళ్లిపై తాజా అప్డేట్..!
Thaman AKhanda Update | అఖండపై థమన్ ఇచ్చిన క్రేజీ అప్ డేట్ ఎంటో తెలుసా..?
Pooja Kannan Debut Film | సాయిపల్లవి సోదరి సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది
Akhanda Musical Roar | అఖండ ‘గర్జన’ కేక..టైటిల్ సాంగ్ లిరికల్ వీడియో