Robert Redford : హాలీవుడ్ నటుడు, ఆస్కార్ దర్శకుడు రాబర్ట్ రెడ్ఫోర్డ్ (Robert Redford) కన్నుమూశాడు. అమెరికాలోని ఉతాహ్ సిటీలోని స్వగృహంలో ఆయన నిద్రలోనే కన్నుమూశాడు. విలక్షణ నటుడిగా పేరొందిన ఆయన 89 ఏళ్ల వయసులో మరణించాడని అతడి నిర్మాణ సంస్థ ‘రోజెర్స్ కొవాన్ పీఎంకే’ వెల్లడించింది. ‘బచ్ కాసిడీ అండ్ ది సుండన్స్ కిడ్’ చిత్రంతో పాపులర్ అయిన రాబర్ట్.. ‘Sundance Institute’ అనే తన సంస్థ ద్వారా స్వతంత్ర సినిమాలను ప్రోత్సహించేవాడు.
రాబర్ట్ తన ఆరు దశాబ్దాల కెరీర్లో హాలీవుడ్‌పై తనదైన ముద్ర వేశాడు. 1960 నుంచి 1970 మధ్య Butch Cassidy and the Sundance Kidస, ‘The Sting, ‘All the President’s Men వంటి క్లాసిక్ చిత్రాలతో పాపులారిటీ సంపాదించుకున్నాడు రాబర్ట్. Ordinary People అనే చిత్రానికిగానూ 1981లో ఉత్తమ దర్శకుడిగా అస్కార్ అవార్డు అందుకున్నాడు. ఇదే మూవీ ఆయనకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు తెచ్చిపెట్టింది. సినిమాలే ప్రపంచంగా బతికిన ఆయన సుండన్స్ పేరుతో సంస్థను నెలకొల్పి.. సొంతంగా సినిమాలు తీయాలనుకునే ఔత్సాహికులకు గాడ్ ఫాదర్ అయ్యాడు.
Robert Redford, heartthrob turned director and indie film booster, dies at 89https://t.co/0wnstFI3BW
— New York Daily News (@NYDailyNews) September 16, 2025
సందేశాత్మక సినిమాల ద్వారా సమాజంలో మార్పు కోసం పాటుపడినందుకు రాబర్ట్‌కు 2016లో అమెరికా అత్యున్నత పౌరపురస్కారం లభించింది. అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా చేతుల మీదుగా ఈ గౌరవాన్ని స్వీకరించాడు రాబర్ట్. నటుడు, నిర్మాత, దర్శకుడిగా రాణించి బహుముఖ ప్రజ్ఞాశీలి అనిపించుకున్న ఆయనకు పలు జీవితకాల సాఫల్య పురస్కారాలు దక్కాయి. 2022లో స్పెషల్ అకాడమీ హానరరీ అవార్డు, గోల్డెన్ గ్లోబ్స్ సెసిల్ బీ, 1994లో డెమిల్లే అవార్డు ఏరికోరి ఈ నట దిగ్గజాన్ని వరించాయి.