AAY Movie | గీతా ఆర్ట్స్2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాణంలో తెరకెక్కిన తాజా చిత్రం ఆయ్ (AAY). ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు అంజి కంచిపల్లి దర్శకత్వం వహించాడు. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా.. రూ.15 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా సెప్టెంబర్ 12 నుంచి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంటాడు కార్తీక్ (నార్నె నితిన్). కరోనా వలన లాక్ డౌన్ రావడంతో తన సోంతఊరు అయిన అమలాపురం వస్తాడు. అయితే అమలాపురంలో వర్క్ ఫ్రం హోమ్ చేసుకుంటునే తన చిన్ననాటి ఫ్రెండ్స్ అయిన హరి(అంకిత్ కోయ), సుబ్బు(రాజ్ కుమార్ కసిరెడ్డి)తో కలిసి సరదాగా గడుపుతుంటాడు. అయితే అదే ఊరిలో ఉన్న పల్లవి (నయన్ సారిక)ని చూసి ఫస్ట్ లుక్‌లోనే ఇష్టం పెంచుకుంటాడు. అయితే ఊరులో ఉండే పల్లవికి సోషల్ మీడియాలో చలాకీగా ఉండడంతో పాటు కులం పట్టింపులు ఎక్కువ. అయితే కార్తీక్ తన కులం వాడే అనుకుని లవ్ చేస్తుంది. అయితే కార్తీక్ కులం వేరని తెలిసిన పల్లవి తన తండ్రి (మైమ్ గోపి) అతడిని చంపేస్తాడని దూరం పెడుతుంది. ఈ క్రమంలో కార్తీక్ ఏం చేస్తాడు. పల్లవి, కార్తీక్‌ల ప్రేమను పల్లవి తండ్రి ఒప్పుకుంటాడా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Oorlo edhavalu ante, andharu first anukunedhi veelane. Aay veelu friends andi.#Aay is coming to Netflix on 12 September in Telugu, Tamil, Malayalam and Kannada!#AayOnNetflix pic.twitter.com/5BhXMTzLWy
— Netflix India South (@Netflix_INSouth) September 7, 2024