జీ తెలుగు పాపులర్ రియాలిటీ షో సీజన్ 1 (Aata Reality show) టైటిల్ విన్నర్ టీనాసాధు (Tina Sadhu) అనుమానాస్పద స్థితిలో కన్నుమూసింది. ఈ విషయాన్ని సహచరుడు ఆట సందీప్ (Aata Sandeep) ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశాడు. ‘టీనా ఇక లేదన్న వార్త వినగానే షాకయ్యా. తీవ్ర దిగ్బ్రాంతిని కలిగిస్తోంది. నాకు తెలిసిన వారిలో గొప్ప వినయం కలిగిన వ్యక్తి టీనా. జీ తెలుగు రియాలిటీ షో ఆమె నా కో పార్ట్నర్ కూడా. టీనా ఆకస్మిక మృతి పట్ల ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఆత్మకు శాంతి చేకూరాలని’ పోస్ట్ పెట్టాడు.
పలు సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా కూడా పనిచేసిన టీనా కొంతకాలంగా సినీ పరిశ్రమకు దూరంగా ఉంటోంది. రఘు అనే వ్యక్తి పెళ్లి చేసుకుని..గోవాలోనే ఉంటున్నట్టు సమాచారం. టీనా ఆట సీజన్ 4కు జడ్జిగా కూడా వ్యవహరించింది. టీనా ఆకస్మిక మరణంతో ఆమెతో పనిచేసిన రియాలిటీ షో కంటెస్టెంట్స్ అంతా షాక్‌లో ఉన్నారు. అయితే టీనా మరణానికి గల కారణాలేంటనేది తెలియాల్సి ఉంది.

ఇన్ స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటుంది టీనా. ఇటీవల టీనా ఓ బీచ్ తీరంలో హ్యాపీ మూడ్‌లో సరదాగా షికారు చేస్తున్న వీడియో ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.