రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌బాబు ఓ చిత్రంలో నటించబోతున్న విషయం తెలిసిందే. జంగిల్ అడ్వెంచర్ కథాంశమిది. ప్రస్తుతం ఈ సినిమాకు స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో ఉన్నారు రాజమౌళి. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయమొకటి బయటికొచ్చింది. ఇందులో బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్షనిస్ట్ అమీర్‌ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటించనున్నారని సమాచారం. ఇప్పటికే ఈ విషయం గురించి చర్చలు జరిగాయని, అమీర్‌ఖాన్ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారని తెలిసింది. హాలీవుడ్ హంగులతో తీయబోతున్న సినిమా కావడంతో అమీర్‌ఖాన్ ఈ చిత్రానికి అంగీకరించే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. బాలీవుడ్‌కు చెందిన అగ్రహీరోలు సంజయ్‌దత్, సైఫ్అలీఖాన్, సల్మాన్‌ఖాన్ దక్షిణాది చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ వరుసలో అమీర్‌ఖాన్ చేరబోతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.