Honeymoon Murder Case | సితారే జమీన్ పర్ విజయం తర్వాత బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ తన తదుపరి ప్రాజెక్ట్‌గా మేఘాలయ ‘హనీమూన్ మర్డర్ కేసు’ (Meghalaya Honeymoon Murder Case)ను తీయబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కొత్తగా పెళ్లయిన రాజా రఘువంశీ హత్యకు గురికావడం, అతని భార్య సోనమ్ ఈ కేసులో నిందితురాలిగా ఉండటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటన ఆధారంగా ఆమిర్ ఖాన్ ఒక క్రైమ్ థ్రిల్లర్ నిర్మించేందుకు ఆసక్తిగా ఉన్నారని, కేసు వివరాలను నిశితంగా పరిశీలిస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలన్నీ అవాస్తవాలని ఆమిర్ ఖాన్ తన టీమ్ ద్వారా స్పష్టం చేశారు. మేఘాలయ హత్య కేసు ఆధారంగా తాను ఎటువంటి సినిమాను తెరకెక్కించడం లేదని ఆమిర్ తెలిపారు.
మరోవైపు ఆమిర్ ఖాన్ ప్రస్తుతం తన నిర్మాణ సంస్థలో పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే తన కొడుకుతో ఎక్‌దిన్ చిత్రాన్ని నిర్మిస్తున్న ఆయన తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో కలిసి ఒక సూపర్ హీరో సినిమా చేయనున్నారు. ఇది 2026 ద్వితీయార్థంలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలాగే ‘మహాభారతం’ అనే తన డ్రీమ్ ప్రాజెక్ట్‌పై కూడా పనిచేస్తున్నారు.