Aamir Khan – Sitaare Zameen Par | బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’.. ఆమిర్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘తారే జమీన్ పర్’ సినిమాకు ఈ చిత్రం సీక్వెల్‌గా వస్తుంది. ఈ సినిమాకు ఆర్ ఎస్ ప్రసన్న దర్శకత్వం వహిస్తుండగా.. ఆమిర్‌ఖాన్ సరసన జెనీలియా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇదిలావుంటే తాజాగా ఈ విడుదల తేదీకి సంబంధించి అప్డేట్ పంచుకున్నాడు ఆమిర్.
గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ముందు రిపబ్లిక్ వేడుకల్లో పాల్గోన్నాడు ఆమిర్ ఖాన్. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. సితారే జమీన్ పర్ షూటింగ్ వడోదరలోనే పూర్తి చేసుకుంది. ఈ ఏడాది డిసెంబర్ వరకు ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాం అని వెల్లడించాడు. దీంతో ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా రాబోతున్నట్లు తెలుస్తుంది. తారే జమీన్ పర్ అందరిని ఎమోషనల్ అయ్యేలా చేసింది.. కానీ ఈ చిత్రం అందరిని నవ్విస్తుంది అంటూ ఆమిర్ తెలిపాడు. ఫస్ట్ పార్ట్‌లో నటించిన దర్శీల్ సఫారీ ఇందులో కీలక పాత్రలో మెరవనున్నట్లు టాక్.