Aamir Khan: సోనమ్ వాంగ్‌చుక్.. ఆ పాత్రకు లింకు లేదు: ఆమిర్ ఖాన్
Aamir Khan: సోనమ్ వాంగ్‌చుక్ ప్రేరణతోనే 3 ఇడియట్స్ చిత్రంలో రాంచో పాత్రను సృష్టించినట్లు నటుడు ఓమి వైద్యా పేర్కొన్నారు. అయితే ఆ వ్యాఖ్యలపై బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ స్పందించారు. ఓమి వైద్యా చేసిన వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. తప్పుడు రీతిలో తన పాత్రను అర్థం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
లండన్: సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ప్రేరణతోనే త్రీ ఇడియట్స్ చిత్రంలో రాంచో పాత్రను సృష్టించినట్లు ఇటీవల ఆ చిత్రంలో నటించిన ఓమి వైద్యా పేర్కొన్నారు. అయితే ఆ వ్యాఖ్యలపై బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్(Aamir Khan) స్పందించారు. ఓమి వైద్యా చేసిన వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. తప్పుడు రీతిలో తన పాత్రను అర్థం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రధాన్‌ను తప్పించాలని కోరుతూ కాక్రోచ్ పార్టీ చేస్తున్న ధర్నాకు మద్దతుగా విద్యా సంస్కర్త సోనమ్ వాంగ్‌చుక్ ప్రస్తుతం ఆమరణ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వాంగ్‌చుక్ దీక్ష పట్ల ఆమిర్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. 3 ఇడియట్స్ చిత్రంలో ఫున్సుక్ వాంగ్డూ పాత్రను ఆమిర్ పోషించాడు. ఆ ఫిల్మ్‌లో రాంచో క్యారెక్టర్ పేరుతో ఆ పాత్ర ఫేమస్ అయ్యింది. అయితే విద్యా సంస్కర్త సోనమ్ వాంగ్‌చుక్ ప్రేరణతో ఆ పాత్రను సృష్టించినట్లు ఆ సినిమాలో నటించిన ఓమి వైద్యా సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
లండన్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న ఆమిర్ ఖాన్ ఓ ప్రశ్నకు బదులిస్తూ.. తనకు కానీ, ఆ చిత్ర దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీకి కానీ, రచయిత అభిజతా్ జోషీకి కానీ.. సామాజిక కార్యకర్త వాంగ్‌చుక్ ఎవరో తెలియదన్నారు. 2009లో రిలీజైన 3 ఇడియట్స్ చిత్రం బాలీవుడ్లో పెద్ద హిట్ కొట్టింది. వాంగ్‌చుక్‌తో రాంచో పాత్రకు సంబంధం లేదని, ఆ చిత్రం చేస్తున్న సమయంలో సోనమ్ అనే వ్యక్తి ఎవరో తెలియదని, చిత్ర బృందంలోని కీలక వ్యక్తులకు ఎవరికీ తెలియదని ఆమిర్ అన్నారు.
నటుడు ఓమి వైద్యా 3 ఇడియట్స్ చిత్రంలో చాతురు రామలింగం పాత్రను పోషించారు. అయితే ఆయన తన ఎక్స్ అకౌంట్లో ఓ పోస్టు పెట్టారు. వాంగ్‌చుక్ ఆధారంగా రాంచో క్యారెక్టర్‌ను రూపొందించినట్లు పేర్కొన్నారు. ఆమరణ దీక్ష చేస్తున్న వాంగ్చుక్కు మద్దతు ఇవ్వాలని ఓమి వైద్యా తన సోషల్ మీడియా పోస్టులో కోరారు. చాతుర్ పోస్టు చేసిన వీడియోను చూశానని, కానీ అతను తప్పుడు విషయాన్ని చెప్పారన్నారు. చాతురు పోస్టు చేసిన వీడియో తర్వాత రాంచో క్యారెక్టర్ గురించి ఆన్లైన్లో చర్చ మొదలైంది. ఇక మరో వైపు వాంగ్‌చుక్ తన ఆమరణ దీక్షను విరమించాలని ఆమిర్ కోరారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

