ముంబై: బాలీవుడ్ నటుడు అమిర్ ఖాన్ తన ఆఫీసులో పూజలు నిర్వహించాడు. లాల్ సింగ్ చద్దా డైరెక్టర్ అద్వైతి చందన్ ఆ పూజలకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. చేతుల్లో కలశాన్ని పట్టుకుని అమిర్ ఖాన్ పూజ నిర్వహించాడు. ఆయన మాజీ భార్య కిరణ్ రావ్ కూడా ఆ పూజకు హాజరయ్యారు. ఎందు కోసం అమిర్ పూజ చేశారో తెలియదు. గురువారం పోస్టు అయిన ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అమిర్, కిరణ్ కలిసి హారతి ఇచ్చారు. అమిర్ ఖాన్ ప్రొడక్షన్ హౌజ్‌కు చెందిన అనేక మంది సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏడాది తర్వాతే మళ్లీ యాక్టింగ్ మొదలుపెట్టనున్నట్లు ఇటీవల అమిర్ చెప్పిన విషయం తెలిసిందే.