ఖర్గే వద్దకు ఆర్టీసీ పంచాయితీ!
తెలంగాణలో ఇటీవల జరిగిన ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ సంఘమైన ఐఎన్టీయూసీని పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన టీడబ్ల్యూయూ కు పార్టీ మద్దతు ఇచ్చిన పంచాయితీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే వద్దకు చేరింది. దీనిపై ఖర్గే తెలంగాణ పీసీసీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది.
- ఎన్నికల్లో ఐఎన్టీయూసీని పక్కనపెట్టడంపై ఆగ్రహం
- కొత్తగా వచ్చిన టీడబ్ల్యూయూకు మద్దతు ఎలా ఇస్తారు?
- కొత్త సంఘానికి ఓట్లు వేయాలని ఎలా లేఖ రాస్తారు?
- పీసీసీ నాయకులను ప్రశ్నించిన ఖర్గే
హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో ఇటీవల జరిగిన ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ సంఘమైన ఐఎన్టీయూసీని పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన టీడబ్ల్యూయూ కు పార్టీ మద్దతు ఇచ్చిన పంచాయితీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే వద్దకు చేరింది. దీనిపై ఖర్గే తెలంగాణ పీసీసీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. 16న తెలంగాణకు వచ్చిన ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్‌కు ఐఎన్ఐటీయూ సీ పరిస్థితిని వివరించినట్టు తెలిసింది. ఆర్టీ సీ ఎన్నికల్లో ఐఎన్టీయూసీని పక్కన పెట్టి.. కొత్తగా పుట్టుకొచ్చిన టీడబ్ల్యూయూ కు మద్దతు ఇవ్వాలని సాక్షాత్తు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ లేఖ రాయడా న్ని ఆయనకు వివరించినట్టు తెలిసింది. కొన్ని డిపోల్లో కాంగ్రెస్‌కు ఓటు వేయాల్సి న కార్మికులు.. ఈయూ కూటమికి వేశారని అందుకే ఆర్టీసీ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైనందని చెప్పినట్టు సమాచారం.
ఫోన్లోనే తలంటిన ఖర్గే?
ఆర్టీసీ కొత్త సంఘం అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి నాడు కార్మికులను వదిలిపెట్టి బీజేపీ లో చేరాడని.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి వనపర్తి అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడి.. ఆ పార్టీకి రాజీనామా చేశాడని ఐఎన్టీయూసీ నేతలు ఏఐసీసీ సెక్రటరీకి చెప్పినట్టు తెలిసింది. ఈ విష యం మొత్తాన్ని ఏఐసీసీ సెక్రటరీ, ఖర్గేకు వివరించినట్టు సమాచారం. దీంతో ఆయ నే నేరుగా తెలంగాణ పీసీసీ నేతలకు ఫోన్ చేసి.. ఫోన్లోనే తలంటినట్టు చెప్తున్నారు. ఇటువంటి ఘటనలు మరొకసారి రిపీట్ కావొద్దని, తెలంగాణలో జరుగబోయే సింగరేణి ఎన్నికలపై దృష్టి పెట్టాలని ఆదేశించినట్టు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

