‘వెలుగు’ తప్పుడు రాతలు
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టను దిగజార్చే దురుద్దేశంతోనే కొండపోచమ్మ నీళ్లు ఫామ్‌హౌస్‌కు మళ్లించారంటూ వీ6 టీవీ, వెలుగు దినపత్రికలు అబద్ధపు కథనాన్ని వండివార్చాయని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత కేతిరెడ్డి వాసుదేవరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.
- వీ6, వెలుగుపై కేతిరెడ్డి వాసుదేవరెడ్డి ఆగ్రహం
హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టను దిగజార్చే దురుద్దేశంతోనే కొండపోచమ్మ నీళ్లు ఫామ్‌హౌస్‌కు మళ్లించారంటూ వీ6 టీవీ, వెలుగు దినపత్రికలు అబద్ధపు కథనాన్ని వండివార్చాయని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత కేతిరెడ్డి వాసుదేవరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఐదు జిల్లాలు, 10 నియోజకవర్గాల్లోని 2.85 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు 750 చెరువులను నింపేందుకు నిర్మించిన కొండపోచమ్మసాగర్ పై ఇలాంటి విషప్రచారం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. 2015లోనే ఎర్రవెల్లి గ్రామాన్ని కేసీఆర్ దత్తత తీసుకుని, ఎండిపోయిన భూముల్లో సామూహిక వ్యవసాయం చేసేందుకు చెరువులను అభివృద్ధి చేశారన్న వాస్తవాన్ని కప్పిపుచ్చి తప్పుడు రాతలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో కరెంట్ కోతలు, ఎండిపోతున్న పంటలతో రోడ్డెకుతున్న రైతులు, ఇతర ప్రభుత్వ వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నా వాటిని ప్రసారం చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి కొమ్ముకాస్తూ వీ6, వెలుగు సంస్థలు చీకటి పత్రికలుగా మారాయని ధ్వజమెత్తారు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ఫామ్‌హౌస్ విస్తీర్ణంపై సీఎం రేవంత్‌రెడ్డి పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తుంటే, అదేబాటలో సదరు మీడియా సంస్థలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. కేసీఆర్‌పై ప్రచురించిన తప్పుడు కథనాన్ని వెంటనే ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో ఆ పత్రిక, టీవీ చానల్ యాజమాన్యాలపై న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

