నా జీవితంలో అత్యంత బలహీన క్షణాలవే
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్‌ఖాన్ భావోద్వేగానికి లోనయ్యారు. ఇటీవల ఓ అంతర్జాతీయ సినీ ఉత్సవంలో పాల్గొన్న ఆయన సుదీర్ఘమైన తన సినీ ప్రయాణాన్ని నెమరువేసుకున్నారు.
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్‌ఖాన్ భావోద్వేగానికి లోనయ్యారు. ఇటీవల ఓ అంతర్జాతీయ సినీ
ఉత్సవంలో పాల్గొన్న ఆయన సుదీర్ఘమైన తన సినీ ప్రయాణాన్ని నెమరువేసుకున్నారు. ‘మీ కెరీర్లో
అత్యంతగా బలహీనంగా భావించిన క్షణాలేంటి?’ అని ఓ విలేకరి అడగ్గా.. ‘కోవిడ్ టైమ్.. ప్రపంచం అంతా
ఒకేచోట లాక్ అయిపోయిన ఆ క్షణాలు, నా జీవితంలోనే అత్యంత బలహీనమైన క్షణాలు. నా ఆలోచనల్లో
మార్పు కూడా అప్పుడే సంభవించింది.
దశాబ్దాల పాటు విశ్రాంతి లేకుండా పనిచేశాను. ఎవరైనా ఓ అయిదారేళ్లు ఆలుపు లేకుండా పనిచేయొచ్చు. కానీ ఏళ్ల తరబడి పనిచేస్తే కుటుంబంతో గడపాల్సిన విలువైన సమయాన్ని కోల్పోతాం. ఈ రోజు నా పిల్లలు పెద్దవాళ్లయ్యారు. నిజానికి వాళ్ల ఎదుగుదల నేను చూడలేదు. నాకు తెలియకుండానే వాళ్లు పెరిగి పెద్దవారయ్యారు. అందుకే వాళ్లను చూసినప్పుడల్లా ఏదో కోల్పోయిన బాధ కలుగుతోంది. నిజానికి ఇప్పటికీ నేను బిజీనే. కానీ నా అంతట నేనే పని తగ్గించుకున్నా. గత నాలుగైదేళ్లుగా కుటుంబం కోసమే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నా’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు ఆమిర్‌ఖాన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

