మొన్నటి వరకు సినిమాలు, వెబ్ సిరీస్‌లు వివాదాలలో నిలిచేవి. ఇప్పుడలా కాదు యాడ్స్ కూడా కాంట్రవర్సీస్ క్రియేట్ చేస్తున్నాయి. కొన్ని సన్నివేశాలు మనోభావాలను దెబ్బతీస్తున్నాయంటూ యాడ్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇటీవల అలియా భట్‌తో తీసిన ‘కన్యాదాన్’ అడ్వర్టైజ్మెంట్ తీవ్ర విమర్శలపాలైన సంగతి తెలిసిందే. ఈ వివాదం చల్లారకముందే ఇప్పుడు ఆమిర్ ఖాన్ యాక్ట్ చేసిన ఓ యాడ్‌పై తీవ్ర దుమారం నడుస్తోంది.
సీయట్ టైర్ల కంపెనీ యాడ్‌లో ఆమీర్ నటించగా ఇటీవల ఆ యాడ్ రిలీజైంది. రోడ్లు ఉంది పటాసులు పేల్చడానికి కాదు’’ అంటూ తన ఎదురుగా ఉన్న జనాలకు క్లాస్ పీకుతూ.. సదరు టైర్ల యాడ్‌ను ప్రమోట్ చేశాడు. ఈ యాడ్ తమ మనోభావాలని కించపరిచేలా ఉందని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సీయట్ను బాయ్‌కాట్ చేయాలంటూ హ్యాష్ ట్యాగ్స్‌తో వేల ట్వీట్స్ చేస్తున్నారు. ఆమిర్ ఖాన్ క్షమాపణలు చెప్పాలని, యాడ్‌ను తొలగించాలని సీయట్ కంపెనీని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. మతాన్ని, పండుగల్ని కించపరిచేలా సీయట్ కంపెనీ యాడ్స్ తీయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు.