Chiranjeevi| మెగాస్టార్ చిరంజీవి.. ఈయన అభిమానులకి ఆరాధ్య దైవం. ఒకప్పుడు చిరంజీవి సినిమాల కోసం ప్రతి ఒక్కరు థియేటర్స్‌కి ఎగబడేవారు. చిరంజీవితో చాలా మందికి చాలా మోమోరీస్ ఉన్నాయి. ఒక్కొక్కరు ఇటీవలి కాలంలో వాటి గురించి చెబుతూ హాట్ టాపిక్ అవుతున్నారు. అయితే చిరంజీవితో నటించాలనే కోరిక అప్పట్లో చాలా మంది హీరోయిన్స్‌కి ఉండేది. కొందరికి ఆ అవకాశం దక్కిన మరి కొందరికి మాత్రం అది కలగానే మిగిలింది. ఆ లిస్ట్‌లో అప్పటి అందాల నటి ఆమని కూడా ఉన్నారు. ఇటీవల చిరంజీవి, వెంకటేష్ లతో నటించే ఛాన్స్ రాలేదంటూ ఓ ఇంటర్వ్యూలో రియాక్ట్ అయ్యారు.
చిరంజీవి గారితో నటించాలనేది నా డ్రీం కాగా, నీ అది నెరవేరలేదు. ఒకటి రెండు సార్లు నాకు అవకాశం వచ్చింది. హీరోయిన్ గా ఛాన్స్ కూడా వచ్చింది . నన్ను ఫైనల్ చేశారు. డేట్లు కూడా తీసుకున్నారు. చిరంజీవి గారితో మాట్లాడి నా సంతోషాన్ని తెలియజేశాను. కానీ చివరి నిమిషంలో ఏం జరిగిందో ఏమో నన్ను తీసేసి వేరే హీరోయిన్గా తీసుకున్నారు. ఒకసారి సిస్టర్‌గా నటించే అవాకశం వచ్చింది. అప్పుడు నేను చిరంజీవి గారి పక్కన సినిమా చేస్తే హీరోయిన్‌గానే చేస్తా, సిస్టర్ పాత్రలు అస్సలు చేయను అని తేల్చి చెప్పేసింది. చిరంజీవి తనకు విపరీతమైన అభిమానం అని, గది నిండా మెగాస్టార్ పోస్టర్స్ ఉండేవని ఆమని స్పష్టం చేసింది.
ఇక చిరంజీవి గారి ఫోటో దిండు కింద పెట్టుకుని నిద్రపోయేదాన్ని. ఆయనంటే అంత అభిమానం అని కూడా ఆమని తెలియజేయడం విశేషం. తాను చిరంజీవికి చెల్లిగా నటించను కాని రామ్ చరణ్‌కి తల్లిగా మాత్రం నటిస్తానంటూ చెప్పడం గమనర్హం.చిరంజీవితో సినిమా చేయలేకపోయాననే విషయం గుర్తొచ్చినప్పుడల్లా ఏడ్చేదానినింటూ ఆమని ఒకింత బాధని వ్యక్తం చేసింది. అయితే కే . విశ్వనాథ్ అంత్యక్రియల సమయంలో చిరంజీవి దగ్గరుండి కార్యక్రమం నిర్వహించగా, అప్పుడు ఓ అభిమానిగా ఆయనతో ఓ ఫోటో దిగినట్టు స్పష్టం చేసింది. కాగా, ఆమని మిస్టర్ పెళ్ళాం, శుభలగ్నం, వంశానికొక్కడు, మావిచిగురు లాంటి హిట్ చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకుంది.