Aadipurush | ఆదిపురుష్‌పై మరో వివాదం..రిలీజ్ చేయనివ్వమంటూ హెచ్చరిక..!
ప్రభాస్ కొత్త సినిమా ఆదిపురుష్ (Aadipurush) గురించి నడుస్తున్న చర్చ ప్రభాస్ ను బాగా డిస్టర్బ్ చేస్తుంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ విడుదలైన తర్వాత ఒక్కసారిగా పరిస్థితులన్నీ మారిపోయాయి.
చూస్తుంటే ప్రభాస్ (Prabhas) టైం బాగోలేనట్టు అనిపిస్తుంది. అటు వ్యక్తిగత జీవితంలో.. అటు ప్రొఫెషనల్ గా కూడా రెండు చోట్ల ప్రభాస్ కు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పెదనాన్న కృష్ణంరాజు మరణం నుంచి ఇంకా కోలుకోకముందే.. తాజాగా తన కొత్త సినిమా ఆదిపురుష్ (Aadipurush) గురించి నడుస్తున్న చర్చ ప్రభాస్ ను బాగా డిస్టర్బ్ చేస్తుంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ విడుదలైన తర్వాత ఒక్కసారిగా పరిస్థితులన్నీ మారిపోయాయి. ఇన్ని రోజులు కేవలం ఒక యానిమేషన్ సినిమా కోసం ప్రభాస్ ను వాడుకున్నారు అంటూ అభిమానులు కూడా దర్శకుడు ఓం రౌత్ పై మండి పడుతున్నారు.
ఇప్పటికే ఈ సినిమా గురించి.. అందులో ఉన్న క్యారెక్టర్స్ గురించి.. వాటి గెటప్స్ గురించి.. ఎంతో నెగిటివ్ ట్రోలింగ్ జరుగుతుంది. ఇవన్నీ ఇలా ఉండగానే తాజాగా ఈ సినిమాపై మరో వివాదం చెలరేగింది. తాజాగా విశ్వ హిందూ పరిషత్ ఆదిపురుష్ సినిమాపై ఆరోపణలు చేసింది. సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలు తొలగించకపోతే సినిమా విడుదల చేయనివ్వం అంటూ హెచ్చరించారు.
ఈ టీజర్లో రాముడు, రావణుడు, హనుమంతుడు పాత్రలను చూపించిన విధానం..రామాయణాన్ని, హిందువుల మత విశ్వాసాలను దెబ్బతీసేదిగా ఉందని వాళ్ళ ప్రధాన ఆరోపణ. అంతేకాకుండా ఈ సినిమాపై సంభాల్ యూనిట్ ప్రచార ప్రముఖ్ అజయ్ శర్మ మీడియా ముందు ఎన్నో అభ్యంతరాలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన సెన్సార్ బోర్డు సభ్యులను కూడా తప్పుపట్టారు.
ఇన్ని అభ్యంతరాలు ఉన్న టీజర్ ను.. కోట్లాది మంది ఆరాధించే ఇతిహాసంపై వస్తున్న సినిమాను జాగ్రత్తగా చూడాలనే కనీస బాధ్యత లేకపోతే ఎలా అంటూ సెన్సార్ బోర్డును ఆయన తప్పు పట్టారు. ఆదిపురుష్ టీజర్ లో అన్ని లోపాలుంటే ప్రదర్శనకు అనుమతి ఇస్తారని ప్రశ్నించారు. వెంటనే భారత ప్రభుత్వం సెన్సార్ సభ్యులపై చర్యలు తీసుకోవాలి.. సెన్సార్ బోర్డును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
కనీసం ఇప్పుడైనా సినిమాలోని లోపాలను సరి చేయాలని.. హిందువుల మనోభావాలు దెబ్బతీసే సన్నివేశాలు తీయకపోతే సినిమా విడుదల చేయడం అసాధ్యం అంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు. సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వస్తున్న ఈ పరిస్థితులు చూసి మేకర్స్ కు మింగుడు పడడం లేదు. పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు సినిమా అంతా పూర్తయింది. ఇప్పుడు ప్రధాన పాత్రల గెటప్స్ మార్చడం దాదాపు అసాధ్యం. మరి ఆదిపురుష్ టీమ్ దీని నుంచి ఎలా బయటపడతారో చూడాలి.
Read Also : Ahimsa Teaser | తేజ టీం క్రేజీ అప్డేట్..లవ్ ట్రాక్, యాక్షన్ పార్టుతో అహింస టీజర్
Read Also :Salman Khan | మై డియర్ చిరు..సల్మాన్ ఖాన్ వీడియో వైరల్
Read Also : Satyadev | గాడ్ ఫాదర్‌తో సత్యదేవ్..ఎమోషనల్ పోస్ట్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

