Vaishnav Tej | మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హిట్టు వాసన చూసి రెండేళ్లయింది. ఉప్పెన తర్వాత రిలీజైన రెండు సినిమాలు అల్ట్రా డిజాస్టర్లుగా మిగిలాయి. ఉప్పెన వంద కోట్ల గ్రాస్ కొల్లగొడితే.. ఆ తర్వాత రిలీజైన రెండు సినిమాలు కలిపి కూడా 50కోట్ల గ్రాస్‌ను సాధించలేకపోయాయి. ప్రస్తుతం మెగా మేనల్లుడి ఆశలన్నీ ఆదికేశవ సినిమాపైనే ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ గట్రా సినిమాపై మంచి హైప్‌నే క్రియేట్ చేశాయి. పైగా త్రివిక్రమ్ కూడా ఈ సినిమా ప్రొడక్షన్లో భాగం కావడం సినిమాపై మరింత అంచనాలు పెంచింది. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ తాజాగా ప్రకటించారు.
ఆదికేశవ సినిమాను ఆగస్టు 18న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఓ రొమాంటిక్ పోస్టర్‌ను కూడా వదిలారు. నిజానికి ఈ సినిమా ఏప్రిల్ మూడో వారంలోనే రిలీజ్ కావాల్సి ఉంది కానీ పలు కారణాల వల్ల పోస్ట్ పోన్ అయింది. శ్రీకాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పూర్తిగా యాక్షన్ బ్రాక్లో తెరకెక్కింది. ఇదివరకే రిలీజైన టీజర్లో యాక్షన్ మోడ్‌లో వైష్ణవ్ విశ్వరూపం చూపించాడు. టాలీవుడ్ లక్కీ చార్మ్ శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. జీవి ప్రకాష్ కుమార్ స్వరాలిందిస్తున్న ఈ సినిమాను సితారా ఎంటర్టైనమెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
We are extremely elated and glad to announce that the adrenaline rush inducing journey of #Aadikeshava is all set to rock theatres on 18th August. ❤️🔥#AadikeshavaOnAug18th 💥#PanjaVaisshnavTej @sreeleela14 @gvprakash #JojuGeorge @aparnaDasss #SrikanthNReddy @NavinNooli… pic.twitter.com/FzjdRZBQfg
— Sithara Entertainments (@SitharaEnts) July 7, 2023