Tees Maar Khan Teaser Date | హిట్లు, ఫ్లాపులలో సంబంధంలేకుండా వరుసగా సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు ఆది సాయికుమార్. ‘ప్రేమకావాలి’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆది అనతికాలంలోనే మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన క్రేజ్ ఎలా ఉన్నా సినిమాలను మాత్రం వరుస పెట్టి ఓకే చేస్తున్నాడు. ఇప్పటికే ఈయన ఆరు సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో ‘తీస్ మార్ ఖాన్’ ఒకటి. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహించాడు. ఇదివరకే చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కరోనా కారణంగా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. కాగా ఇటీవలే మేకర్స్ జూలై 27న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో చిత్రబృందం అప్డేట్లను స్టార్ చేసింది.
తీస్ మార్ ఖాన్ టీజర్‌ను జూన్ 18న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంతేకాకుండా పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్లో పోలీస్ గెటప్‌లో ఇంటెన్సీవ్‌గా కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆదికి జోడీగా రాజ్‌పుత్ పాయల్ హీరోయిన్గా నటించింది. విజయ్ సినిమాస్ బ్యానర్‌పై నాగం తిరుపతిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించాడు. సునీల్, పూర్ణ, కబీర్ దుహాన్ సింగ్ కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రంలో ఆది మూడు విభిన్న పాత్రల్లో నటించనున్నాడు. ఒకటి స్టూడెంట్ పాత్ర కాగా మరోకటి రౌడి పాత్ర.. ఇంకోటీ పోలీస్ పాత్ర. ఇలా మూడు డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్‌తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమైయ్యాడు.
Get Ready for the Dhamaka 💥💥 #TeesMaarKhanTeaser Releasing on June 18th at 11:43 AM pic.twitter.com/6fLZmsUPKs
— AadiSaikumar (@AadiSaikumar) June 16, 2022