Aadi Pinisetty- Nikki Galrani | ‘బుజ్జిగాడు’ ఫేం సంజన గల్రానీ చెల్లెలు నిక్కీ గల్రానీ తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న ముఖమే. ఈమె ‘కృష్ణాష్టమి’, ‘మలుపు’, ‘మరకతమని’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈమె ప్రముఖ నటుడు ఆది పినిశెట్టితో ప్రేమలో ఉందని గతం నుంచే వార్తలు వస్తున్నాయి. తాజాగా కోలీవుడ్ వర్గాల్లో అందుతున్న సమాచారం ప్రకారం వీళ్ళీద్దరూ త్వరలోనే ఒకటవ్వబోతున్నట్లు టాక్. ‘మలుపు’ సినిమా నుంచే వీళ్ళీద్దరూ ఇష్టపడ్డారని తెలుస్తుంది. అంతేకాకుండా అప్పట్లో ఆది వాళ్ల ఇంటి ఫంక్షన్లో నిక్కీ హాజరైంది. తాజాగా వీళ్లద్దరికి కావలిసిన ఓ వ్యక్తి పెళ్ళిపై వివరణ ఇచ్చాడు.
ఆదిపినిశెట్టి, నిక్కీగల్రానీ త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నారని, ప్రస్తుతం నిశ్చితార్థానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని, త్వరలోనే పెళ్ళి తేదీని నిర్ణయిస్తారు అని తెలిపాడు. కానీ ఇప్పటివరకు దీనిపై ఈ జంట స్పందించలేదు. ఇక ఆది అటు హీరోగా, ఇటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీ రంగంలో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఈయన నటించిన ‘క్లాప్’ నేరుగా సోని లివ్‌లో విడుదలై మంచి వ్యూస్‌ను సాధించింది. ఆది పినిశెట్టి ప్రస్తుతం ‘ది వారియర్’ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు.