ఆది పినిశెట్టి, ఆకాంక్షసింగ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘క్లాప్’. పృథ్వీ ఆదిత్య దర్శకుడు. రామాంజనేయులు, ఎం.రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. తమిళ, తెలుగు భాషల్లో సోనీ లివ్ ఓటీటీలో నేడు విడుదలకానుంది. గురువారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆది మాట్లాడుతూ ‘ఈ సినిమాలో కమర్షియల్ అంశాలు లేకపోయినా హృదయాన్ని స్పృశించే భావోద్వేగాలుంటాయి. అనూహ్యంగా వైకల్యానికి గురైనప్పటికి జీవితంపై ఆశ కోల్పోకుండా తన కలల సాఫల్యం కోసం ఓ అథ్లెట్ చేసిన ప్రయాణం..అతనికి చేయూతనందించిన అమ్మాయి కథ ఇది. ఇందులో నాయకానాయికలిద్దరూ క్రీడాకారులుగా కనిపిస్తారు. ఇళయరాజా రీరికార్డింగ్ సినిమాకు ప్రధానబలంగా నిలుస్తుంది’ అన్నారు. ఎలాంటి కష్టాలొచ్చినా ఆశావహదృక్పథాన్ని కోల్పోవద్దనే సందేశం ఉన్న సినిమా ఇదని కథానాయిక ఆకాంక్షసింగ్ తెలిపింది. క్రీడా నేపథ్యంలో ఇప్పటివరకు ఈ తరహా సినిమా రాలేదని నిర్మాత పేర్కొన్నారు. ప్రకాష్‌రాజ్, నాజర్, రాందాస్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్ కుమార్, సంగీతం: ఇళయరాజా, నిర్మాణ సంస్థలు: శర్వంత్ రామ్ క్రియేషన్స్, శ్రీషిర్టీసాయి మూవీస్, దర్శకత్వం: పృథ్వీ ఆదిత్య.