Aadi Pinisetty | ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న ‘అఖండ’ సీక్వెల్ ‘అఖండ తాండవం’పై ప్రేక్షకుల్లో అంచనాలు సామాన్యంగా లేవు. దానికి తగ్గట్టుగానే బాలయ్య కెరీర్లో ఇది తొలి పానిండియా సినిమా కావడం విశేషం. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాలకృష్ణ కుమార్తె ఎం.తేజస్విని నందమూరి సమర్పకురాలిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో నటుడు ఆది పినిశెట్టి ఓ పవర్ఫుల్ పాత్ర పోషిస్తున్నట్టు శనివారం మేకర్స్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు.
‘సరైనోడు’ సినిమాలో ఆదిని ైస్టెలిష్ విలన్‌గా ప్రజెంట్ చేశారు బోయపాటి. ఈ సినిమాలోని పాత్ర కూడా తన కెరీర్లో గుర్తుండిపోయేలా ఉంటుందని, ఇందులో ఆయన కొత్త లుక్‌లో కనిపిస్తారని, బాలకృష్ణ, ఆది పినిశెట్టి మధ్య జరిగే సన్నివేశాలు ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తాయని బోయపాటి చెబుతున్నారు. హైదరాబాద్ అన్నపూర్ణ ఏడెకరాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నది. రామ్‌లక్ష్మణ్ నేతృత్వంలో భారీ యాక్షన్ సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. బాలకృష్ణ, ఆది పినిశెట్టి.. ఇద్దరూ ఈ షూట్లో పాల్గొంటున్నారు. సినిమాలో హైలైట్‌గా నిలిచే సన్నివేశంగా ఇది చెబుతున్నారు. సంయుక్త మీనన్ ఫిమేల్ లీడ్ పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సి.రాంప్రసాద్, సంతోష్ డి, సంగీతం: తమన్, నిర్మాణం: 14రీల్స్ ప్లస్.