Aadavari Matalaku Arthale Verule | టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ (Venkatesh), త్రిష (Trisha) జంటగా నటించిన చిత్రం ఆడవారి మాటలకు అర్దాలే వేరులే (Aadavari Matalaku Arthale Verule). ఈ సినిమాకు ఒకప్పటి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ సెల్వ రాఘవన్ (Selva Raghavan) దర్శకత్వం వహించాడు. 2007లో విడుదలై ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా భారీ విజయం సాధించింది. కామెడీ, లవ్, ఎమోషన్, ఫ్యామిలీ అంశాలు కలగలిపి ఉండటంతో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక యువన్ శంకర్ రాజా (Yuvan Shanker raaja) సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు చార్ట్ బస్టర్లుగా మిగిలాయి.
ఇక ఈ మధ్య సూపర్ హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ వస్తున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ ట్రెండ్ బాగా నడుస్తున్నది. తాజాగా ఆడవారి మాటలకు అర్దాలే వేరులే సినిమాకు కూడా సీక్వెల్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
వివరాల్లోకెళితే.. 2013లో దర్శకుడు సెల్వ రాఘవన్ ఆడవారి మాటలకు అర్దాలే వేరులే (AMAV) సినిమా మళ్ళీ చూశాను. వెంకటేష్ గారు, త్రిషతో వర్క్ చేయడం గొప్ప అనుభవం. దీనికి సీక్వెల్ తీయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అని ట్వీట్ చేశారు. ఈ ట్విట్ చేసి పది సంవత్సరాలు అయ్యింది. అయితే ఈ ట్విట్ను త్రిష కృష్ణన్.. నిన్న రీ ట్వీట్ చేస్తూ.. ఆడవారి మాటలకు అర్దాలే వేరులే సినిమా సీక్వెల్ కి నేను రెడీ అంటూ తన మనసులో మాటను బయటపెట్టింది. ఇక దీనిపై సెల్వ రాఘవన్, విక్టరీ వెంకటేష్ ఏమని స్పందిస్తారో చూడాలి. కాగా ప్రస్తుతం ఈ పోస్టు వైరల్గా మారింది.
I’m ready @selvaraghavan 😝 https://t.co/9DCojSHe3u
— Trish (@trishtrashers) September 10, 2023