‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్..!
‘సమ్మోహనం’, ‘వి’ చిత్రాల తర్వాత సుధీర్‌బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబోలో తెరకెక్కుతున్న మూడో సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
Aa Ammayi Gurinchi Meeku Cheppali Pre-Release Event | ‘ప్రేమ కథా చిత్రమ్’, ‘సమ్మోహనం’, ‘వి’ వంటి సినిమాలతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సుధీర్ బాబు. గతంలో రొటీన్ సినిమాలను చేసుకుంటూ వచ్చిన సుధీర్ బాబు ‘సమ్మోహనం’ సినిమాతో తన రూట్ మార్చుకున్నాడు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ హీరోగా వైవిధ్యతను చాటుకుంటున్నాడు. ప్రస్తుతం ఈయన మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే లవ్ ఎంటర్టైనర్ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 16న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుసగా ప్రమోషన్లను జరుపుతు బిజీగా గడుపుతున్నారు.
ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. మంగళవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్స్‌లో జరుపున్నట్లు ప్రకటించారు. ఈవెంట్ గెస్ట్‌గా మహేష్‌బాబు రానున్నట్లు సమాచారం. ఈ చిత్రం సుధీర్‌బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబోలో తెరకెక్కుతున్న మూడో సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. గతంలో వీళ్ల కాంబోలో వచ్చిన ‘సమ్మోహనం’, ‘వి’ చిత్రాలు ప్రేక్షకుల మెప్పు పొందాయి. ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తుంది. రాహుల్ రామకృష్ణ కీలకపాత్ర పోషిస్తున్నాడు. బెంచ్‌మార్క్ స్టూడీయోస్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
#AaAmmayiGurinchiMeekuCheppali Grand Pre Release Event tomorrow at JRC conventions, HYD 💥💥
In Cinemas SEP 16 ❤️@isudheerbabu @IamKrithiShetty #MohanaKrishnaIndraganti @MythriOfficial @benchmarkstudi5 @saregamasouth pic.twitter.com/1RjyGBggDr
— Benchmark (@BM_Storytellers) September 12, 2022
Read Also:
Thalapathy67 | విజయ్-లోకేష్ మూవీ కోసం సంజయ్‌దత్ అన్ని కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడా?
Ponniyin Selvan | భారీ ధరకు ‘పొన్నియన్ సెల్వన్’ ఓటీటీ హక్కులు.. వామ్మో అన్ని కోట్లా?
Krishnam Raju | రెబల్‌స్టార్ కృష్ణంరాజు కూతుళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

