Pushpa The Rule | టాలీవుడ్లో రాబోతున్న మోస్ట్ అవెయిటెడ్ సినిమాల్లో ఒకటి పుష్ప.. ది రూల్ (Pushpa The Rule). సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన పుష్ప.. ది రైజ్‌కు సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పుష్పరాజ్‌గా మరోసారి ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమాను ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించేశారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ ఇంట్రో విడుదల చేయగా.. ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. ఇదిలావుంటే తాజాగా మూవీ నుంచి రష్మిక ఫోటో లీక్ అయ్యింది.
ఈ మూవీలో రష్మిక మందన్నా శ్రీవల్లి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్‌లో జరుపుకుంటుడగా.. తాజాగా ఈ పాత్రకు సంబంధించిన ఒక లుక్ బయటకు వచ్చింది. ఎరుపు రంగు చీరలో ఉన్న శ్రీవల్లి ఒంటినిండా బంగారు ఆభరణాలు ధరించి మహాలక్ష్మి లాగా అందంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సొషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది.
Srivalli from the sets of #Pushpa2TheRule @iamRashmika #Pushpa2TheRule #RashmikaMandanna #Srivalli pic.twitter.com/z1hRTXZ9s7
— 𝗔𝗔 𝐋𝐢𝐧𝐠𝐚𝐬𝐰𝐚𝐦𝐲 𝕏 🐉 (@lingaswamyaa) March 19, 2024