‘ఇండియన్-2’ చిత్రం కోసం కమల్‌హాసన్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎన్నో అవాంతరాలను అధిగమిస్తూ షూటింగ్‌ను జరుపుకుంటున్నది. 1996లో విడుదలైన కల్ట్ క్లాసిక్ ‘ఇండియన్’కు రీమేక్ ఇది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. ఇటీవల చెన్నైలో రెండు వారాల పాటు నిర్విరామంగా జరిగిన భారీ షెడ్యూల్లో టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేశారు. కేవలం ఒక్క పాట మాత్రమే మిగిలి ఉందని చిత్ర బృందం పేర్కొంది.
ఈ సీక్వెల్‌తో పాటు ఫ్రాంఛైజీలో భాగంగా మూడో పార్ట్ ‘ఇండియన్-3’ షూటింగ్ కూడా జరుపుతున్నారని, ఈ రెండు భాగాల షూటింగ్‌ను ఫిబ్రవరిలోగా పూర్తి చేస్తారని చెన్నై సినీ వర్గాల సమాచారం. ‘ఇండియన్-2’లో అన్యాయం, అవినీతిపై పోరాటం చేసే సేనాపతి పాత్రలో కమల్‌హాసన్ కనిపించనున్నారు. వర్తమాన సామాజిక అంశాలను చర్చిస్తూ దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్‌సింగ్, ప్రియా భవానీ శంకర్ తదితరులు ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు.