Love reddy | చిన్న సినిమాగా విడుదలై హౌజ్‌ఫుల్ కలెక్షన్స్‌తో నడుస్తుంది లవ్ రెడ్డి అనే చిత్రం. యువ నటులు అంజన్ రామచంద్ర, శ్రావణి జంటగా నటించిన చిత్రం ‘లవ్‌రెడ్డి’. ఇటీవల ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. గురువారం ఈ చిత్రబృందం సినిమా రెస్పాన్స్ ఎలా ఉంది అని హైదరాబాద్‌లోని థియేటర్లను సందర్శించింది.
అయితే ఇందులో భాగంగా నిజాంపేట జీపీఆర్ మల్టీప్లెక్స్ థియేటర్‌కు వెళ్లిన చిత్రయూనిట్‌కు ఒక చేదు అనుభవం ఎదురైంది. ఈ సినిమా అయిపోయిన అనంతరం బాగుందా అంటూ చిత్రయూనిట్ ప్రేక్షకులను అడుగుతుండగా.. ఒక మహిళ వచ్చి లవ్ రెడ్డి తండ్రి పాత్రలో నటించిన ఎన్టీ రామస్వామిపై దాడి చేసింది. ఈ సినిమా చూసి ఎమోషనల్ అయిన మహిళ ప్రేమికులను విడదీస్తావా? అంటూ రామస్వామిని చితకబాదింది. అయితే పక్కనే ఉన్న నటులు హీరో అంజన్ రామచంద్ర, హీరోయిన్ శ్రావణి, దర్శకుడు స్మరణ్ రెడ్డి ఇతర కాస్ట్ ఆమెను అడ్డుకొని ఇది మూవీ అని నచ్చజెప్పారు. దీంతో దీనికి సంబంధించిన వీడియోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదిలావుంటే ఈ ఘటన ప్రమోషన్స్‌లో భాగంగా వైరల్ అవ్వడానికి చేసినట్లు ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Shocking Incident 📍 GPR mall , Hyderabad
📽️🎬 ” Love Reddy ” – emotional burst pic.twitter.com/4S6vqyD3ee
— XstarAkhil (@akhilxsivala) October 25, 2024
Another publicity stunt.
People in the film industry go to any extent to promote their movies. At least, heroine should have acted here, anyways she did not act in the film. #LoveReddy pic.twitter.com/xdYAnjFFFi
— At Theatres (@AtTheatres) October 25, 2024