Actor Bhumi Pednekar | యూపీలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం.. మన సమాజం చెడిపోయిందన్న బాలీవుడ్ నటి
Girl in UP | ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బల్లియా జిల్లాలో తొమ్మిదేళ్ల దళిత బాలికపై ఇద్దరు మైనర్ బాలురు లైంగిక దాడికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.
Girl in UP | ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బల్లియా జిల్లాలో తొమ్మిదేళ్ల దళిత బాలికపై ఇద్దరు మైనర్ బాలురు లైంగిక దాడికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. అయితే ఈ దారుణ ఘటనపై బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ తీవ్రంగా స్పందించారు. మన పిల్లలు ఎటువంటి వాతావరణంలో పెరుగుతున్నారో ఆలోచించాలని కోరిన ఆమె, ఈ ఉదంతం మన దెబ్బతిన్న సమాజానికి నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మహిళలు, పిల్లలపై జరుగుతున్న వరుస దాడులపై ప్రజల్లో ఆందోళన పెరుగుతున్న తరుణంలో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. బల్లియా జిల్లా హల్దీ ప్రాంతంలో బాధితురాలి గ్రామానికే చెందిన 11, 12 సంవత్సరాల వయసున్న ఇద్దరు మైనర్ బాలురు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను భూమి పెడ్నేకర్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పంచుకుంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అసలు ఏం జరుగుతోందని, మన పిల్లలకు ఎలాంటి పరిస్థితులు కల్పిస్తున్నామో చూసి కూడా మనం ఎందుకు అప్రమత్తం కావడం లేదని, సిగ్గుపడటం లేదని ఆమె ప్రశ్నించారు. ఈ ఘటనలో ఆ చిన్నారితో పాటు, సదరు మైనర్ బాలురు కూడా ఈ చెడిపోయిన సమాజం సృష్టించిన బాధితులేనని ఆమె అభిప్రాయపడ్డారు. సమాజంలో మహిళలపై ఎదురవుతున్న వేధింపులపై భూమి స్పందించడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల ఒక మహిళ గోడ పెయింటింగ్‌ను ఉద్దేశించి ఒక యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించిన వైరల్ వీడియోపై కూడా ఆమె ఘాటుగా స్పందించారు. నేటి యువత మానసిక స్థితి ఇలాగే ఉంటే, భవిష్యత్తులో వారు మహిళలు, పిల్లలపై దాడులకు తెగబడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కేవలం మాటలు, సానుభూతి సరిపోవని, ఇటువంటి నేరాలను అరికట్టడానికి అత్యంత కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆమె డిమాండ్ చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

