Sankranthiki Vasthunnam | విక్టరీ వెంకటేష్ హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించడమే కాకుండా తాజాగా ప్రతిష్టాత్మక అవార్డును కూడా సొంతం చేసుకుంది.
ముంబైలో జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA 2026) అవార్డుల వేడుకలో అనిల్ రావిపూడి తెలుగు విభాగంలో ‘ఉత్తమ దర్శకుడు’ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కెరీర్లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా అత్యంత ప్రత్యేకమైనదని తెలిపాడు. కేవలం రూ.50 కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి, పెట్టిన పెట్టుబడికి ఆరు రెట్ల లాభాలను తెచ్చిపెట్టడం ఒక దర్శకుడిగా తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని ఆయన వెల్లడించారు. ఈ సినిమాకు కమర్షియల్ సక్సెస్తో పాటు విమర్శకుల ప్రశంసలు మరియు జాతీయ స్థాయి అవార్డు దక్కడం పట్ల అనిల్ రావిపూడి హర్షం వ్యక్తం చేశారు.