Street Fighter | 90ల నాటి జ్ఞాపకాలతో ‘స్ట్రీట్ ఫైటర్’.. అక్టోబర్ 16న గ్రాండ్ రిలీజ్
Street Fighter | ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థలు పారామౌంట్ పిక్చర్స్ మరియు లెజెండరీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా తెరకెక్కించిన అత్యంత ప్రతిష్టాత్మక యాక్షన్ చిత్రం ‘స్ట్రీట్ ఫైటర్’ ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సర్వం సిద్ధం చేసుకుంది.
Street Fighter | ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థలు పారామౌంట్ పిక్చర్స్ మరియు లెజెండరీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా తెరకెక్కించిన అత్యంత ప్రతిష్టాత్మక యాక్షన్ చిత్రం ‘స్ట్రీట్ ఫైటర్’ ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సర్వం సిద్ధం చేసుకుంది. ఎన్నో అంచనాల మధ్య రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 16న తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళ భాషల్లో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో ఉన్న ప్రసిద్ధ టీసీఎల్ చైనీస్ థియేటర్లో నిర్వహించిన ఈ సినిమా ప్రీమియర్ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ ఈవెంట్‌కు హాలీవుడ్ తారలు నోహ్ సెంటినియో, ఆండ్రూ కోజి, జాసన్ మోమోవా, 50 సెంట్, ప్రఖ్యాత రెజ్లర్ కన్ నటుడు రోమన్ రీన్స్‌తో పాటు మన భారతీయ యాక్షన్ హీరో విద్యుత్ జమాల్ హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
తొలి ప్రదర్శన చూసిన సినీ విశ్లేషకులు మరియు ప్రముఖుల నుంచి ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన లభిస్తోంది. 90ల నాటి గోల్డెన్ ఎరా జ్ఞాపకాలను మళ్లీ కళ్లకు కట్టేలా ఈ సినిమాను తెరకెక్కించారని ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ప్రముఖ వీడియో గేమ్‌ను ఏమాత్రం చెడగొట్టకుండా, దాని సోల్ ను అలాగే ఉంచుతూ దర్శకుడు కిటావో సకురాయ్ తెరకెక్కించిన విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. కేవలం యాక్షన్ సన్నివేశాలే కాకుండా, కడుపుబ్బా నవ్వించే హాస్యం మరియు ఎమోషనల్ సీన్స్ ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయని విశ్లేషకులు కొనియాడుతున్నారు.
ప్రముఖ సినీ క్రిటిక్ బ్రాండన్ డేవిస్ ఈ సినిమాను పక్కా ‘విన్నర్’గా అభివర్ణించారు. ముఖ్యంగా 90ల నాటి వాతావరణాన్ని రీక్రియేట్ చేసిన తీరు, నటీనటుల అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్తాయని తెలిపారు. ఈ చిత్రంలో ర్యూ పాత్రలో ఆండ్రూ కోజి జీవించేశాడని, అకుమా పాత్రలో రోమన్ రీన్స్ భయపెట్టేలా కనిపించి థ్రిల్ గురిచేశాడని ఆయన పేర్కొన్నారు. మరొక విశ్లేషకుడు థామస్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు వచ్చిన వీడియో గేమ్ ఆధారిత చిత్రాల్లో ‘స్ట్రీట్ ఫైటర్’ అత్యుత్తమ స్థానంలో నిలుస్తుందని ప్రశంసించారు. గేమ్‌లో ఉన్న చిన్న చిన్న వివరాలను సైతం మిస్ కాకుండా తెరపైకి తీసుకురావడంలో దర్శకుడు సఫలమయ్యారని, కాలినా లియాంగ్ మరియు కోడి రోడ్స్ నటన సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని తెలిపారు.
ఇక ఈ చిత్రంలో నటీనటుల విషయానికి వస్తే.. కెన్ మాస్టర్స్‌గా నోహ్ సెంటినియో, ర్యూగా ఆండ్రూ కోజి, చున్-లిగా కాలినా లియాంగ్, ధాల్సిమ్గా మన విద్యుత్ జమాల్ నటిస్తున్నారు. వీరే కాకుండా జాసన్ మోమోవా, 50 సెంట్, డేవిడ్ డాస్ట్‌మాల్చియన్, కోడి రోడ్స్, జో అనోవై (రోమన్ రీన్స్) వంటి భారీ తారాగణం ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. 80, 90ల నాటి క్లాసిక్ యాక్షన్ సినిమాలను తలపించేలా భారీ పోరాట ఘట్టాలు, అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో వాడిన 2డీ యానిమేషన్ సినిమా స్థాయిని పెంచేశాయని క్రిటిక్స్ యూనివర్శిపల్గా అంగీకరిస్తున్నారు. మొత్తానికి వీడియో గేమ్ లవర్స్‌కే కాకుండా సాధారణ మాస్ ఆడియెన్స్‌కు కూడా ఈ సినిమా గూస్బంప్స్ తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

