Game Changer | దర్శకుడు శంకర్ సినిమాలంటేనే భారీతనానికి పెట్టింది పేరు. అబ్బురపరిచే సెట్స్, గ్రాఫిక్స్ హంగులతో ఆయన చిత్రాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతాయి. ఇక పాటల చిత్రీకరణలో మిగతా దర్శకులకంటే శంకర్ విభిన్నమైన పంథాను అనుసరిస్తారు. భారీ హంగులతో విజువల్ ఫీస్ట్‌లా పాటలకు రూపకల్పన చేస్తారు. ప్రస్తుతం ఆయన రామ్‌చరణ్ కథానాయకుడిగా ‘గేమ్ ఛేంజర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. రాజకీయ, సామాజిక అంశాలను చర్చించే కథాంశమిదని సమాచారం.
ఈ సినిమాలో మొత్తం ఐదు పాటలున్నాయి. వీటి చిత్రీకరణ కోసం 90 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. పాటల విషయంలో అన్కాంప్రమైజ్డ్గా వ్యవహరించే దర్శకుడు శంకర్ ఈ సినిమా కోసం కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని చెబుతున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్నందిస్తున్నాడు. చిత్రీకరణ చివరి దశలో ఉందని సమాచారం. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అగ్ర నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.