8 Vasantalu | యువ దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి (Phanindra Narsetti) దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘8 వసంతాలు’(8 Vasantalu). దాదాపు 7 సంవత్సరాల తర్వాత మెగాఫోన్ పట్టిన ఈ దర్శకుడు ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మిస్తుండగా.. ఈ సినిమాలో మ్యాడ్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న అనంతిక సనిల్ కుమార్ లీడ్ రోల్లో నటిస్తుంది.
ఈ చిత్రం జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేసిన చిత్రయూనిట్ తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ చూస్తుంటే.. లవ్ స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ రాబోతున్నట్లు తెలుస్తుంది. ప్రేమ జీవితంలో ఒక దశ మాత్రమే.. కానీ అదే దిశ కాదు.. మగాడి ప్రేమకు సాక్ష్యాలుగా పాలరాతి సౌధాలు, భాగ్యనగరాలు ఉన్నాయి. ఆడదాని ప్రేమకు ఏముంది. మనసులోనే సమాధి చేసుకున్న జ్ఞాపకాలు తప్ప వంటి డైలాగ్స్ మనసుని హత్తుకునేలా ఉన్నాయి. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ ట్రైలర్‌ను మీరు చూసేయండి.