7/G Brindavan Colony | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ సృష్టించిన చిత్రాల్లో టాప్‌లో ఉంటుంది 7/G బృందావన కాలనీ (7/G Brindavan Colony). రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సెల్వ రాఘవన్ (Selvaraghavan) డైరెక్ట్ చేశాడు. రవి కృష్ణ, సోనియా అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించింది. ఈ ఆల్‌టైమ్ బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్ రాబోతుందన్న వార్త ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా సీక్వెల్ షూటింగ్ అప్డేట్ ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమా సీక్వెల్ పనులు కొనసాగుతున్నాయని, రవికృష్ణ (Ravi Krishna) మరోసారి లీడ్ రోల్లో కనిపించబోతున్నాడని శ్రీ సూర్య మూవీస్ చీఫ్ ఏఎం రత్నం గతేడాది ప్రకటించేశాడని తెలిసిందే. ఒరిజినల్ వెర్షన్‌కు రైటర్ కమ్ డైరెక్టర్‌గా పనిచేసిన సెల్వ రాఘవన్ సీక్వెల్‌ను కూడా తెరకెక్కించబోతున్నాడట. ఆగస్టు 2023 చివరి వారంలో షూటింగ్ షురూ కానుందన్న క్రేజీ న్యూస్ ఒకటి ఇప్పుడు మూవీ లవర్స్‌ను ఖుషీ చేస్తోంది. మరి దీనిపై రాబోయే రోజుల్లో మేకర్స్ ఏదైనా అధికారిక ప్రకటన చేస్తారనేది చూడాలి.
లవ్ టుడే ఫేం ఇవానా, అదితి శంకర్ పేర్లు ఫీ మేల్ లీడ్ రోల్ కోసం పరిశీలనలో ఉన్నట్టు ఇన్సైడ్ టాక్. త్వరలోనే మరిన్ని వివరాలపై క్లారిటీ రానున్నట్టు తెలుస్తోంది.
2004లో తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. రవి కృష్ణ (Ravi Krishna), సోనియా అగర్వాల్ కెరీర్లో ల్యాండ్ మార్క్ సినిమాగా నిలిచిపోయింది. చంద్రమోహన్, విజయన్, సుమన్ శెట్టి, సుధ, మనోరమ ఇతర కీలక పాత్రల్లో నటించారు. సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనేది చూడాలంటున్నారు సినీ జనాలు. ఈ చిత్రం తమిళంలో 7/G రెయిన్బో కాలనీ టైటిల్‌తో విడుదలైంది.