టాలీవుడ్ (Tollywood) యాక్టర్ రానా దగ్గుబాటి భాషతో సంబంధం లేకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు ఎప్పుడు సపోర్ట్ ఇస్తుంటారని తెలిసిందే. ఈ క్రేజీ యాక్టర్ ప్రస్తుతం కన్నడ హీరో రక్షిత్ శెట్టి (Rakshit Shetty)హీరోగా నటిస్తున్న 777 చార్లీ (777 Charlie) తెలుగు వెర్షన్ సమర్పిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగులో సురేశ్ ప్రొడక్షన్స్ విడుదల చేస్తుంది. కాగా సినిమా ట్రైలర్ను రేపు విడుదల చేయనున్నారు. ఈ చిత్ర ట్రైలర్ను రేపు మధ్యాహ్నం 12:12 గంటలకు టాలీవుడ్ యాక్టర్లు వెంకటేశ్ (Venkatesh), సాయిపల్లవి, లక్ష్మీ మంచు విడుదల చేయనున్నారు.
777 చార్లీ లో సంగీత శృంగేరీ, రాజ్ బీ శెట్టి, డానిష్ సేత్, బాబీ సింహా, ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జూన్ 10న 777 చార్లీ థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. కన్నడలో మంచి క్రేజ్ సంపాదించిన రక్షిత్ శెట్టి..అతడే శ్రీమన్నారాయణ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలుకరించాడు. ఈ సారి 777 చార్లీ ప్రాజెక్టు రక్షిత్ శెట్టి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.
.@VenkyMama,@Sai_Pallavi92, @LakshmiManchu and many other celebrities will launch #777Charlie Telugu official trailer at 12:12 pm, tomorrow. ❤️@rakshitshetty @ranadaggubati @Kiranraj61 @nobinpaul @RajbShettyOMK @sangeethaSring @pratheek_dbf @SureshProdns @ParamvahStudios pic.twitter.com/zBUQkIgXP2
— Suresh Productions (@SureshProdns) May 15, 2022