70th National Film Awards | కన్నడ బ్లాక్ బస్టర్ చిత్రం కాంతార (Kantara)70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో సత్తా చాటింది. ఈ సినిమాలో నటనకు గాను కన్నడ హీరో రిషబ్ షెట్టి (Rishab Shetty) ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుచుకోవడమే కాకుండా.. ఉత్తమ ప్రేక్షక ఆదరణ అందించిన చిత్రంగా కాంతార నిలిచింది. ఇక మలయాళం ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ఆట్టం(Aatam) చిత్రం ఉత్తమ చిత్రంగా నిలిచింది. రణ్బీర్ కపూర్ నటించిన బ్రహ్మాస్త్ర – పార్ట్ 1: శివ చిత్రం ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ సినిమాగా అవార్డు అందుకోగా.. బాలీవుడ్ దర్శకుడు సూరజ్ బర్జాత్యా ఉంచాయి సినిమాకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు అందుకున్నాడు. ఇక అవార్డుల అందుకున్న విజేతలు చూసుకుంటే..
ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ
ఉత్తమ చిత్రం – ఆట్టమ్ (మలయాళం) (ఆనంద్ ఎకర్షి)
ఉత్తమ నటుడు – రిషబ్ షెట్టి (కాంతార)
ఉత్తమ దర్శకుడు – సూరజ్ బర్జాత్యా (ఉంచాయి – హిందీ)
ఉత్తమ నటి – నిత్య మేనన్ (తిరుచిత్రబళం – తమిళం), మానసి పరేఖ్ (కచ్ ఎక్స్ప్రెస్ – గుజరాతీ)
ఉత్తమ సినిమాటోగ్రఫీ – రవివర్మన్ (పొన్నియిన్ సెల్వన్ 1)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: బ్రహ్మాస్త్ర – పార్ట్ 1
ఉత్తమ దర్శకుడు (డెబ్యూ): ప్రమోద్ కుమార్, ఫౌజా (హరియాన్వీ)
ఉత్తమ సహాయ నటి: నీనా గుప్తా (ఉంచాయి- హిందీ)
ఉత్తమ సహాయ నటుడు: పవర్ రాజ్ మల్హోత్రా (ఫౌజా – హరియాన్వి)
బెస్ట్ ఎడిటింగ్: ఆట్టం, ఎడిటర్: మహేష్ భువనేండ్
బెస్ట్ సౌండ్ డిజైన్: పొన్నియిన్ సెల్వన్ – 1 (తమిళం), డిజైనర్: ఆనంద్ కృష్ణమూర్తి
బెస్ట్ స్క్రీన్ప్లే (ఒరిజినల్): ఆట్టం – ఆనంద్ ఏకార్షి,
బెస్ట్ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్ : బాంబే జయశ్రీ (చాయుమ్ వెయిల్), సౌదీ వెల్లక్క సీసీ 225/2009
ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ : అర్జిత్ సింగ్ (కేసరియా) – బ్రహ్మాస్త్ర- పార్ట్ 1: శివ (హిందీ)
ఉత్తమ కొరియోగ్రీఫీ: జానీ మాస్టర్, సతీష్ కృష్ణన్ తిరుచిత్రాంబళం (తమిళ్)
బెస్ట్ లిరిక్స్: ఫౌజా (హరియాన్వీ), రచయిత: నౌషద్ సదర్ ఖాన్
ఉత్తమ సంగీతం (పాటలు): బ్రహ్మస్త్ర: శివ (హిందీ) – ప్రీతమ్
ఉత్తమ సంగీతం (నేపథ్యం): పొన్నియిన్ సెల్వన్ – 1 (తమిళ్), సంగీత దర్శకుడు: ఏఆర్ రెహమాన్
బెస్ట్ మేకప్: అపరాజితో (బెంగాళీ), ఆర్టిస్ట్: సోమనాథ్ కుందు
ఉత్తమ ప్రాంతీయ చిత్రం (ఒడియా): దమన్
ఉత్తమ ప్రాంతీయ చిత్రం (మలయాళం): సౌది వెళ్లక్క సీసీ 225/2009
ఉత్తమ ప్రాంతీయ చిత్రం (మరాఠీ): వాల్వీ (ది టెర్మైట్)
ఉత్తమ ప్రాంతీయ చిత్రం (కన్నడ): కేజీయఫ్ 2
ఉత్తమ ప్రాంతీయ చిత్రం (హిందీ) : గుల్మోహర్
ఉత్తమ ప్రాంతీయ చిత్రం (బెంగాళీ): కబేరి అంతర్దాన్
బెస్ట్ టివా ఫిల్మ్: సికాసిల్
ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు): కార్తికేయ 2
ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తమిళం): పొన్నియిన్ సెల్వన్ – 1
ఉత్తమ ప్రాంతీయ చిత్రం (పంజాబీ): బాగీ డి దీ
బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్: శ్రీపాథ్ (మలికాపురమ్ – మలయాళం)
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్: కుచ్ ఎక్స్ప్రెస్ (గుజరాతీ), డిజైనర్: నిక్కి జోషి
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ : అపరాజితో, డిజైనర్: ఆనంద అద్య
ఉత్తమ డైలాగ్ రైటర్: గుల్మోహర్: అర్పితా ముఖర్జీ, రాహుల్ వి చిట్టెల
ఉత్తమ యాక్షన్ డైరక్షన్: అన్బరివు (కేజీయఫ్ 2)
నాన్-ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ
ఉత్తమ నాన్-ఫీచర్ ఫిల్మ్ – అయేనా(సిద్ధాంత్ సరిన్)
ఉత్తమ డాక్యుమెంటరీ – మర్మర్స్ ఆఫ్ ది జంగిల్
ఉత్తమ స్క్రిప్ట్ – మోనో నో అవేర్ (కౌశిక్ సర్కార్)
ఉత్తమ కథనం/వాయిస్ ఓవర్ – మర్మర్స్ ఆఫ్ ది జంగిల్ (సుమంత్ షిండే)
ఉత్తమ యానిమేషన్ చిత్రం – ఎ కోకోనట్ ట్రీ (జోషి బెనెడిక్ట్)
ఉత్తమ ఎడిటింగ్ – సురేష్ యుఆర్ఎస్ (మధ్యంతర)- (ఇంటర్మిషన్)
ఉత్తమ సౌండ్ డిజైన్ – యాన్ (మానస్ చౌదరి)
ఉత్తమ సినిమాటోగ్రఫీ – మోనో నో అవేర్ (సిద్ధార్థ్ దివాన్)
ఉత్తమ షార్ట్ ఫిల్మ్ – ఉన్యుత (వాయిడ్) – అస్సామీ
ఉత్తమ నాన్-ఫీచర్ ఫిల్మ్ డైరెక్షన్ – ఫ్రమ్ ది షాడో బై మిరియం చాందీ మేనాచెరి
ఉత్తమ నాన్-ఫీచర్ ఫిల్మ్ మ్యూజిక్ డైరెక్షన్ – విశాల్ భరద్వాజ్ ఫర్సత్
బెస్ట్ బుక్ ఆన్ సినిమా – కిషోర్ కుమార్: అనిరుధా భట్టాచార్జీ & పార్థివ్ ధర్ రాసిన ది అల్టిమేట్ బయోగ్రఫీ
ఉత్తమ సినీ విమర్శకుడు – దీపక్ దువా (హిందీ)
70th National Film Awards for the Year 2022 Announced!📽️
Best Actress in a Leading Role (Feature Films) goes to:
1. Nithya Menen for film Thiruchitrambalam (Tamil) &
2. Manasi Parekh for the film Kutch Express (Gujarati)Best Actor in a Leading Role (Feature Films) goes to:… pic.twitter.com/r6L1lQczjh
— PIB India (@PIB_India) August 16, 2024
70th National Film Awards for the Year 2022 Announced! 📽️
Two Assamese films receive Special Mention (Non-Feature Films):
* Birubala “Witch to Padmashri”
* Hargila – The Greater Adjutant Stork #NationalFilmAwards pic.twitter.com/XDEjTaUAYn— PIB India (@PIB_India) August 16, 2024