సిద్ధార్థ్ హీరోగా రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంటైర్టెనర్ ‘3 BHK’. శరత్‌కుమార్, దేవయాని, యోగిబాబు కీలక పాత్రధారులు. శ్రీగణేశ్ దర్శకుడు. శాంతి టాకీస్ పతాకంపై బ్లాక్‌బస్టర్ ‘మావీరన్’ నిర్మాత అరుణ్‌విశ్వ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జూలై 4న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్‌కి మంచి స్పందన వచ్చిందని మేకర్స్ చెబుతున్నారు. తాజాగా ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్‌ని స్టార్ట్ చేసి, తొలిపాటను మేకర్స్ విడుదల చేశారు.
‘కలలన్నీ..’ అంటూ సాగే ఈ పాటను రాకేందుమౌళి రాయగా, అమృత్ రామ్‌నాథ్ స్వరపరిచారు. హేమచంద్ర వేదాల, గోపికా పూర్ణిమ, సాహితీ చాగంటి, పివిఎన్ఎస్ రోహిత్ కలిసి ఈ పాటను ఆలపించారు. సిద్ధార్థ్, దేవయాని పాత్రలపై ఫ్యామిలీ ఎమోషన్స్ నేపథ్యంలో ఈ పాట సాగింది. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే పూర్తి కమర్షియల్ సినిమా ఇదని మేకర్స్ చెబుతున్నారు. మీఠా రఘునాథ్, చైత్ర తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: రాకేందు మౌళి, కెమెరా: దినేష్‌కృష్ణన్.బి అండ్ జితిన్ స్టానిస్లాన్.