3 రోజుల వరకు చూడలేరు

టాలీవుడ్ లో ఇప్పుడు వకీల్ సాబ్ ఫీవర్ నడుస్తోంది. తెలుగురాష్ట్రాల్లోనే కాదు వరల్డ్ వైడ్ ఈసినిమా ఏప్రిల్ 9న రిలీజ్ కాబోతోంది. దీనికి తోడు పవర్ స్టార్ కి పోటీగా ఏ సినిమా కూడా లేకపోవడంతో అన్నీ థియేటర్లలోనూ వకీల్ సాబ్ సందడే కనిపిస్తోంది. అయితే మూడేళ్ల తర్వాత పవన్ కల్యాణ్ ని వెండితెరపై చూడబోతున్నామని ఆనందపడుతున్న ఫ్యాన్స్ ఎడాపెడా షోలన్నింటిని బుక్ చేసేశారు. మూడురోజుల పాటు థియేటర్లన్నీ హౌజ్ ఫుల్లే. ఒక్కటంటే ఒక్క షోకి కూడా టిక్కెట్లు లేవు. మహేష్ బాబు AMB థియేటర్లో అయితే 27 షోలన్నీ ముందే బుక్కైపోయాయి. దీంతో తొలి రోజే కాదు కనీసం వీకెండ్ లోనైనా వకీల్ సాబ్ సినిమా చూద్దామనుకున్న సినీ ప్రేక్షకులకు నిరాశే ఎదురవుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. దీంతో వకీల్ సాబ్ వసూళ్లలోనూ రికార్డ్ లు సృష్టించడం ఖాయమంటున్నారు సినీఎనలిస్ట్లు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో నివేదాథామస్, అంజలి, అనన్యలు కీలకపాత్రలో నటిస్తున్నారు. తమన్ ఈసినిమాకి సంగీతం అందించాడు. వేణుశ్రీరామ్ ఈసినిమాని తెరకెక్కించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

