Varudu Kaavalenu: యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న ఫోక్ సాంగ్..!

ఈ మధ్య కాలంలో ఫోక్ సాంగ్‌కి మంచి ఆదరణ లభిస్తుంది. ఈ క్రమంలోనే సారంగ దరియా, బుల్లెట్ బండి పాటలు ఎంతగా హల్చల్ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు నాగశౌర్య వరుడు సినిమా పాటకి కూడా ఇప్పుడు అలాంటి ఆదరణే దక్కుతుంది. యంగ్ హీరో నాగ శౌర్య, రీతూ వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ‘వరుడు కావలెను’.
సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ 4వ తేదిన రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంలో మురళీ శర్మ, నదియా, వెన్నెల కిషోర్, ప్రవీణ్, హర్షవర్ధన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి కొద్ది రోజుల క్రితం విడుదలైన “దిగు దిగు నాగ” అనే ఫోక్ సాంగ్ యూట్యూబ్‌లో సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తూ వస్తుంది. ఈ పాటకు ఇప్పటివరకు 20 మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చాయి. ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాయగా, శ్రేయా గోషల్ ఆలపించగా, థమన్ సంగీతం అందించారు. భక్తి పాటని ఫోక్ సాంగ్‌గా మార్చి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుంది చిత్ర బృందం.
20M+ Views for Folk Sensation #DiguDiguDiguNaaga💥🥁
— Aditya Music (@adityamusic) October 11, 2021
▶️https://t.co/U7F59YlUAV
🎵 @MusicThaman
🎤 @shreyaghoshal
✍️ #AnanthaSriram#VaruduKaavalenu @IamNagashaurya @riturv @LakshmiSowG @vamsi84 @Composer_Vishal @SitharaEnts @adityamusic pic.twitter.com/MByedtS4Nc
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

