2018 Movie Break Even Completed | కంటెంట్ కాస్త కొత్తగా ఉంటే టాలీవుడ్ ప్రేక్షకులు పర భాష సినిమాలను నెత్తిన పెట్టుకుని ఊరేగుతారు అని మరోసారి ‘2018’ సినిమాలతో రుజువైంది. మూడు వారాల క్రితం మలయాళంలో విడుదలై ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ఈ సినిమా మూడు రోజుల క్రితం తెలుగులో విడుదలైంది. బన్నీ వాసు ఈ సినిమాను తెలుగులో విడుదల చేశాడు. రిలీజ్‌కు ముందు ప్రెస్ మీట్ తప్పితే పెద్దగా ప్రమోషన్లు గట్రా ఏమి చేయలేదు. అయినా కానీ ఈ సినిమా తొలిరోజే తుఫాన్ లాంటి కలెక్షన్లు సాధించింది. తెలుగు సినిమాలకు పోటీగా దిగి మొదటి రోజే కోటికి పైగా గ్రాస్‌ను కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది.
ఇక తొలిరోజు మౌత్ టాక్ అద్భుతంగా ఉండటంతో రెండో రోజు కూడా అదే స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. పైగా వీకెండ్ కావడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ తండోపతండాలకు తరలి వస్తున్నారు. ఇక ఆదివారం కలెక్షన్లతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. రెండు కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్లోనే నాలుగన్నర కోట్ల గ్రాస్‌ను, రెండు కోట్లకు పైగా షేర్‌ను సాధించింది. ఇక వీక్ డేస్‌లోనూ ఈ సినిమాకు సాలిడ్ బుకింగ్స్ జరుగుతున్నాయి. వచ్చే శుక్రవారం వరకు ఈ సినిమాకు ఎలాంటి పోటీ లేదు. ఈ లోపు డిస్ట్రిబ్యూటర్లకు లాభాల బాట పట్టడం ఖాయం.
2018లో వచ్చిన కేరళ వరదల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మలయాళంలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఏడేళ్ల కిందట వచ్చిన ‘పులిమురుగన్’ మొన్నటి వరకు మలయాళ ఇండస్ట్రీ హిట్‌గా ఉండేది. ఇక తాజాగా ఈ సినిమా రూ.150 కోట్ల క్లబ్లో అడుగుపెట్టింది. దీన్ని బట్టి చూస్తే కంటెంట్‌తో వస్తే కలెక్షన్లకు అడ్డేది అర్థమవుతుంది. టివినో థామస్, కుంజుకో బాబిన్, అపర్ణ బాల మురళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు జూడ్ ఆంథోని జోసెఫ్ దర్శకత్వం వహించాడు.