ఎస్.ఎస్.సైదులు, భ్రమరాంబిక, అర్పిత లోహి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘1980లో రాధేకృష్ణ’. ఇస్మాయిల్ షేక్ దర్శకుడు. ఎస్వీ క్రియేషన్స్ పతాకంపై ఊడుగు సుధాకర్ నిర్మిస్తున్నారు. తెలుగు మరియు బంజారా భాషల్లో విడుదలకానుంది.
శుక్రవారం నిర్మాతలు బెక్కం వేణుగోపాల్, రామ్ తాళ్లూరి, హీరో సోహైల్ చిత్ర టీజర్‌ను ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘1980ల నాటి ప్రేమకథ ఇది. అప్పటి రోజులను కళ్లముందుంచుతూ హృద్యంగా సాగుతుంది. కథానుగుణంగా పాటలకు మంచి ప్రాధాన్యత ఉంది’ అన్నారు. ఈ చిత్రానికి ఎం.ఎల్.రాజా సంగీతాన్నందించారు.