18Years Of Ram Charan’s Glory | టాలీవుడ్లో 18 ఏండ్లు పూర్తి చేసుకున్న రామ్ చరణ్.. ‘పెద్ది’ సినిమా నుంచి కొత్త పోస్టర్
18Years Of Ram Charan's Glory | టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినీ పరిశ్రమలో నేటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, సినీ వర్గాలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
18Years Of Ram Charan’s Glory | టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినీ పరిశ్రమలో నేటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, సినీ వర్గాలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ‘చిరుత’ చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్, తన 18 ఏళ్ల కెరీర్లో ‘మగధీర’, ‘రంగస్థలం’, ‘RRR’ వంటి బ్లాక్బస్టర్లతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేశారు. ప్రస్తుతం బుచ్చిబాబు సానాతో పెద్ది అనే సినిమాతో చేస్తున్నాడు. అయితే రామ్ చరణ్ 18 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ.. పెద్ది నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.
ఈ పోస్టర్లో రామ్ చరణ్ రస్టిక్ లుక్‌లో గడ్డం, మాసిన జుట్టుతో చాలా పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నారు. నల్లటి అంగీ, ఎర్రటి చారల చొక్కా ధరించి, ముక్కుకు పోగుతో, బీడీ తాగుతూ చాలా ఇంటెన్స్ లుక్‌లో రామ్ చరణ్ దర్శనం ఇచ్చారు ఈ పోస్టర్ సినిమా కథ నేపథ్యాన్ని, చరణ్ పాత్ర శక్తిని సూచిస్తూ ఉందంటూ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా సంగీత దర్శకుడిగా ఏ.ఆర్. రెహమాన్ పనిచేస్తున్నారు.
Celebrating our #Peddi‘s 18 incredible years in cinema ❤🔥
From carrying a rich legacy on screen to being grounded off the screen, you’ve stood apart from all the stars and paved your own path giving us many moments of high & energy.
Here’s to celebrating MEGA POWER STAR… pic.twitter.com/3CMr8nARah— Vriddhi Cinemas (@vriddhicinemas) September 28, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

