టాలీవుడ్ (Tollywood) యాక్టర్లు అవికాగోర్ (Avika Gor), శ్రీరామ్ (Sreeram) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘టెన్త్ క్లాస్ డైరీస్’ (10th Class Diaries). డైరెక్టర్ క్రిష్ (Krish) ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. అందమైన లొకేషన్లో శ్రీరామ్, అవికాగోర్తోపాటు శ్రీనివాస్‌రెడ్డి, హిమజ, వెన్నెల రామారావు,అర్చన ఫన్ టైం మూడ్‌లో ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
స్నేహం, ప్రేమలోని కోణాలను తెరపై ఆవిష్కరిస్తూ..వాస్తవ ఘటనల స్ఫూర్తితో యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో అంజి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. రాజశేఖర్ హీరోగా నటించిన పీఎస్వీ గరుడ వేగకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు అంజి. అంగ్రేజ్, ఎర్రబస్సు, ఐస్‌క్రీమ్, అటాక్ సహా 49 సినిమాలకు అంజి పనిచేశాడు.
ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్ పై అచ్యుతరామరావు, పి.రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రవికుమార్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శ్రీనివాస్‌రెడ్డి, వెన్నెల రామారావు, శివబాలాజీ, మధుమిత, భానుశ్రీ, హిమజ, అర్చన ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Samantha: నాగచైతన్య కోసం సమంత ఇన్ని త్యాగాలు చేసిందా?
Samantha | హీరో కోసం చూస్తున్న సమంత..!
samantha | కండీషన్స్ పెడుతున్న సమంత.. వాటికి ఓకే అంటేనే సినిమాకు సై..
Preetham: ఆగని మాటల దాడి.. చైతూ స్పందించాలని కోరుతున్న సమంత స్టైలిస్ట్