టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో మహేశ్ బాబు నటిస్తోన్న క్రేజీ ప్రాజెక్టు సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). పరశురాం (Parasuram) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో కీర్తిసురేశ్ (Keerthy Suresh) హీరోయిన్గా నటిస్తోంది. మే 12న విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే టీం ప్రమోషన్స్ షురూ చేసింది. కాగా మేకర్స్ అదిరిపోయే అప్ డేట్ అందిస్తూ..ట్రైలర్ సూపర్ స్టార్ 105 షాట్స్ తో రాబోతుందని..ట్రైలర్‌కు ముందు గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు.
మే 2న సాయంత్రం 4:05 గంటలకు ట్రైలర్ సందడి చేయనుందని అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ బ్యానర్ల అసోసియేషన్‌తో ఈ సినిమా నిర్మిస్తోంది. ప్రస్తుతం పరశురాం అండ్ టీం పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ ప్లాన్‌తో బిజీగా ఉంది. బ్యాంకింగ్ కుంభకోణాల నేపథ్యంలో వస్తోంది సర్కారు వారి పాట.
Delivering 105 shots of SuperStar's MENTAL MASS SWAG Tomorrow at 4:05 PM 💥💥#SVPTrailer 🔥#SarkaruVaariPaata#SVPOnMay12
Super🌟 @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @madhie1 @14ReelsPlus @GMBents @MythriOfficial @saregamasouth pic.twitter.com/6FmqF9QhqO
— SarkaruVaariPaata (@SVPTheFilm) May 1, 2022
ఇప్పటికే ఎస్ థమన్ కంపోజ్ చేసిన పాటలకు అద్బుతమైన స్పందన వస్తోంది.సిద్ శ్రీరామ్ పాడిన కళావతి పాట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ నెట్టింట రికార్డుల పంట పండిస్తోంది.