నరేన్, దీపాలిశర్మ జంటగా నటించిన చిత్రం ‘ఊరికి ఉత్తరాన’. వనపర్తి వెంకటయ్య, రాచాల యుగంధర్ నిర్మాతలు. సతీష్ అండ్ టీమ్ దర్శకత్వం వహించారు. రేపు ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లో చిత్రబృందం పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటుచేసింది. హీరో మాట్లాడుతూ ‘చిన్న సినిమాలకు ఉండే కష్టాలన్నీ మాకు ఎదురయ్యాయి. కథపై ఉన్న నమ్మకంతో ఆ అడ్డంకులను ఎదురించి పూర్తిచేశాం. పల్లెటూరి ప్రేమకథా చిత్రమిది. రాజు, శైలజ అనే జంట ప్రేమప్రయాణానికి చక్కటి దృశ్యరూపంగా ఉంటుంది’ అన్నారు. రెగ్యులర్ లవ్స్టోరీస్కు భిన్నంగా ఉండే చిత్రమిదని, ఇందులో శైలు అనే అమ్మాయిగా తన పాత్ర వైవిధ్యంగా సాగుతుందని కథానాయిక దీపాలిశర్మ చెప్పింది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో.