ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్, మ్యూజిక్ సెన్సేషన్ ఏఆర్ రెహ్మాన్ స్క్రిప్ట్ రైటర్ గా, నిర్మాతగా మారి తెరకెక్కించిన చిత్రం 99 సాంగ్స్. ఇహాన్ భట్, ఎడిల్సి లీడ్రోల్స్ లో నటించారు. విశ్వేష్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు తమిళం, హిందీ భాషల్లో విడుదలైంది. ఈ సందర్బంగా న్యూ జర్నీ మొదలుపెట్టిన ఏఆర్ రెహ్మాన్ కు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఎల్లప్పుడూ నీకు ఆల్ ది బెస్ట్. నీ సినిమా 99 సాంగ్స్ కు ఆ దేవుడి దీవెనలు ఉంటాయని విశ్వసిస్తున్నానని రజినీకాంత్ ట్వీట్ చేశారు. మరోవైపు రజినీకాంత్ అల్లుడు, హీరో ధనుష్ కూడా శుభాకాంక్షలు తెలిపాడు. మనీషా కొయిరాలా, లీసా రే, రంజిత్ బరోత్ రాహుల్ రామ్ కీ రోల్స్ పోషించారు. ఏఆర్ రెహ్మాన్ సౌండ్ ట్రాక్ కంపోజ్ చేశాడు.
Wishing you the very best always and for the release of your film #99Songs dear @arrahman ji. May god bless you pic.twitter.com/WEWc1uKbSp
— Rajinikanth (@rajinikanth) April 16, 2021