అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ కజిన్ విరాన్ ముత్తంశెట్టి హీరోగా నటిస్తున్న చత్రం ‘ముఖ్య గమనిక’. వేణు మురళీధర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. లావణ్య కథానాయిక. శివిన్ ప్రొడక్షన్స్ పతాకంపై సాయికృష్ణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఫిబ్రవరి మూడోవారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘ఇటీవల విడుదలైన టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఇప్పటివరకు టచ్ చేయని ఓ వినూత్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తున్నాం. కథ, కథనాలు ఆద్యంతం ఉత్కంఠగా సాగుతాయి. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులనూ మెప్పిస్తుంది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కిరణ్ వెన్న, నిర్మాతలు: రాజశేఖర్, సాయికృష్ణ, దర్శకత్వం: వేణు మురళీధర్.వి.