హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): 2020లో స్థాపితమై రియల్ రంగంలో విలువలను సృష్టించిన ‘యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా’ తక్కువ వ్యవధిలోనే అంచనాలను అధిగమించి ముందుకు సాగుతున్నది. హైదరాబాద్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ‘రియల్’ సంస్థగా ఆవిర్భవించిందని చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కమలాకర గానాడి పేర్కొన్నారు. కొనుగోలుదారుల విశ్వాసం, నమ్మకాన్ని సంపాదించడంలో కీలకంగా వ్యవహరిస్తూ నిర్మాణరంగంలో అత్యంత నాణ్యతలను పాటిస్తున్నది. స్థిరమైన నిర్మాణ పద్ధతులు, రియాల్టీ మార్కెట్లో వచ్చే ఎప్పటికప్పుడు మారుతున్న డిమాండ్లకు ప్రతిగా నూతన ఆవిష్కరణలు ఉంటాయి.
నైతిక సూత్రాలు, చురుకైన వృత్తి నైపుణ్యం, కస్టమర్‌కు విలువను అందించడంలో తిరుగులేని నిబద్దతతో కూడిన సంస్థను సృష్టించడం. ‘యోషిత’ అనే పేరు అతని దివంగత మేనకోడలికి నివాళులర్పిస్తుంది. ప్రేరణాత్మక మూలం అని పేర్కొంటారు డైరెక్టర్ కమలాకర్. పరిశ్రమ ప్రమాణాల ప్రకారం రియల్ ఎస్టేట్, హౌసింగ్ సెగ్మెంట్లో ఆశించదగిన ఖ్యాతిని నెలకొల్పడానికి ఆరేండ్లు పట్టింది. కస్టమర్ల సంతృప్తి పట్ల అచంచలమైన నిబద్దత కారణంగా ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. తెలంగాణతోపాటు ఏపీలో కూడా ఆకట్టుకునే వెంచర్లను కలిగి ఉంది. నిర్మాణ నైపుణ్యం అచంచలమైన పారదర్శకత ద్వారా మార్గనిర్దేశనం చేయబడుతుంది. రాజీలేని దృఢమైన ప్రమాణాల ద్వారా బలపరుస్తున్నారు.
ఒక ప్రీమియర్ రియల్ ఎస్టేట్ డెవలపర్‌గా, యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా సరసమైన ఔత్సాహిక గృహాల నుంచి అగ్రశ్రేణి నివాసాల వరకు విస్తృతమైన వినియోగదారుల విభాగాలను కలిగి ఉంది. ఆదర్శ ఇల్లు అనే భావన మధ్యతరగతి కొనుగోలుదారుల కోసం రూపొందించారు. హెచ్ఎండీఏ, ఏపీసీఆర్డీఏ, డీటీసీపీ అనుమతులు కలిగి ఉన్న ప్రాజెక్టులనే నిర్వహిస్తున్నారు. కస్టమర్ అవసరాలను అర్థం చేసుకోవడం, అత్యుత్తమ నాణ్యతను అందించడం, నివాసితుల జీవితాలను సమగ్ర పద్ధతిలో మెరుగుపర్చడంలో అంకితభావం స్పంష్టంగా కనబడుతుంది. నాణ్యత, సకాలంలో అందించడంతో ఫలితాలపై ప్రభావం చూపుతుంది. ఇప్పటి వరకు 9 ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసి నిష్కళంకమైన ట్రాక్ రికార్డును కలిగి ఉంది. వీటిలో యోషిత సంస్థ ప్రాజెక్టులు సెటబ్రిటీ వోక్స్రిడ్జ్, సెలబ్రిటీ హిల్ వ్యూ, లూమినస్ సెరినిటీ, సుప్రీం జోన్, ఎమినెంట్ ఎంపైర్, ధరణి ఎన్‌క్లెవ్, గ్రీన్ వ్యాలీ ఉన్నాయి.
ప్రాజెక్టుల చుట్టూ పచ్చదనం, సుందరమైన దృశ్యాలు నెలకొన్నాయి. ఇది కలల ఇంటిని నిర్మించడానికి లేదా పెట్టుబడి ప్రయోజనాల కోసం సరైన వివిధ పరిమాణాల నివాస ప్లాట్లను అందిస్తున్నది. ప్రధాన రహదారులు, పాఠశాలలు, ఆసుపత్రులు, షాపింగ్ సెంటర్లకు సులభంగా యాక్సెస్‌తో కూడిన పరిసరాలుంటాయి. పట్టణ, గ్రామీణ జీవనానికి మధ్య సంపూర్ణ సమతుల్యతను అందిస్తుంది. ఎంతో మందికి ఉపాధిని సృష్టించే సామాజిక బాధ్యతగా తీర్చిదిద్దారు. వ్యాపారం, ప్రక్రియ, మానవవనరులు, శ్రామికశక్తిని సృష్టించి ప్రత్యక్షంగా, పరోక్షగా ఉపాధి అవకాశాలను అందించడానికి ఒక ప్రమాణాన్ని నెలకొల్పాడు. పెరుగుతునన ప్రాపర్టీ ధరల మధ్య సరసమైన గృహాలు మధ్యతరగతికి అందుబాటులో ఉండేలా ప్రాజెక్టులను తీర్చిదిద్దారు.