చెన్నై, ఏప్రిల్ 7: ద్విచక్ర వాహన సంస్థ యమహా..మరో స్పోర్ట్స్ బైకును దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్(టీసీఎస్) కలిగిన ఏరోక్స్ 155ను విడుదల చేసింది. నాలుగు రకాల్లో లభించనున్న ఈ బైకు రూ.1,42,800 ప్రారంభ ధర కాగా, గరిష్ఠంగా రూ.1,85,900గా నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి.